కిక్కిరిసిన వాంఖడే స్టేడియం… భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన భారత స్టార్లను సన్మానిచేందుకు బీసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమాన సంద్రం
ఛాంపియన్స్ కోసం ఛాంపియన్స్ బోర్డు… వాంఖడే స్టేడియంలో భారత స్టార్ల సన్మాన కార్యక్రమం కోసం బీసీసీఐ చేసిన భారీ ఏర్పాట్లు
ముంబై తీరాన జనసంద్రం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కటౌట్లతో అభిమానులు. క్రికెట్ అభిమానుల చేతుల్లో రెపరెపలాడుతున్న మువ్వెన్నల పతాకాలు
వాటర్ సెల్యూట్… విశ్వ విజేతలుగా నిలిచి దేశ రాజధాని దిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబైలో అడుగుబెట్టిన జగజ్జేతలకు వాటర్ సెల్యూట్ చేస్తున్న ఎయిరిండియా
విశ్వవిజేతలకు మనసారా స్వాగతం పలికేందుకు ఎక్కేడెక్కడినుంచో అభిమానులు ముంబయికి పోటెత్తారు. మధ్యాహ్నం నుంచే భారీ సంఖ్యలో ఫాన్స్ మెరైన్ రోడ్‌కు చేరుకున్నారు.
విజేతలకు బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిని వాంఖడె స్టేడియంలోనే భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం అందజేయనున్నారు.
మేరా భారత మహాన్… ఈ విజయం… ఎన్నో కోట్ల అభిమానులు కోరుకున్న విజయం… సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిన సమయంలో అభిమానల సంబరం
ఓ వైపు ఎగిసిపడుతున్న సముద్రపు కెరటాలు.. మరోవైపు విజయ నినాదాలు.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన వేళ క్రికెట్ అభిమాన జన సందోహం
Published at : 04 Jul 2024 08:10 PM (IST)
క్రికెట్ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి