Latest NewsTelangana

Inter 2nd year exams are starting from today and more than 5 lakh students are going to appear


Telangana Intermediate Exams: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభంకాన్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను మొత్తం 9,80,978 మంది విద్యార్థులు రాస్తుండగా.. వీరిలో మొదటి సంవత్సరం నుంచి 4,78,718 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. సెకండియర్‌ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్‌ విద్యార్థులున్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం..
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మెుత్తం 4 లక్షల 88 వేల 113 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 19,641 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఇంటర్ బోర్డ్ (Inter Board) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 15,21 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. విద్యార్థులు (Student) కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని సైతం కేంద్రాల్లోకి అనుమతించ లేదు. ఎవరైనా కాపీ కొట్టినా ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

విద్యార్థులకు కీలక సూచనలు..

➥ ఇంటర్‌ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

➥ సెల్‌ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించారు. 

➥ మాల్‌ ప్రాక్ట్రీస్‌, కాపీయింగ్‌ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్‌ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు.

➥ ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. 

పకడ్భందీ ఏర్పాట్లు..
పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 సెంటర్లను అధికారులు ఏర్పాటుచేశారు. వీటిలో 880 సెంటర్లను ప్రైవేట్‌ కాలేజీల్లో, 407 సెంటర్లను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో, మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేశారు. ఇక పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లు,  విధులు నిర్వర్తించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకొంటున్నట్టు వివరించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షాకేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు-1,521 మంది; ఫ్లయింగ్‌ స్కాడ్‌-75 మంది; సిట్టింగ్‌ స్కాడ్‌ – 200 మంది విధులు నిర్వహించనున్నారు.

ఇంటర్‌ సెకండ్‌ పరీక్షలు షెడ్యూలు..

➥ 29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II

➥ 02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II

➥ 05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II

➥ 07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II

➥ 12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II

➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II

➥ 16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II

➥ 19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి



Source link

Related posts

పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ ఐటమ్‌ సాంగ్‌!

Oknews

నయనతారా… ఈ ఎక్స్‌పోజింగ్‌ దాని కోసమేనా?

Oknews

Big twist before nominations in AP! ఏపీలో నామినేషన్ల ముందు బిగ్ ట్విస్ట్!

Oknews

Leave a Comment