Sukanya Samriddhi Yojana Benefits: మీకో కుమార్తె ఉందా?. ఆమె బాగా చదువుకుని & మంచి స్థాయిలో స్థిరపడాలని మీరు అనుకుంటుంటే, ఆమె బంగారు భవిష్యత్ కోసం ఇప్పట్నుంచే కొంత డబ్బును దాచాలని భావిస్తుంటే, మీ పనిని సులభం చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
మీ కుమార్తె భవిష్యత్ కోసం మీకు ఉన్న మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒకటి. దీనిలో పెట్టుబడి పెడితే, ఆ డబ్బు మీ అమ్మాయి కళాశాల చదువులకు లేదా వివాహానికి లేదా ఇతర అవసరాలకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది.
SSY యొక్క తాజా వడ్డీ రేటు
సుకన్య సమృద్ధి యోజన ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం (Small Saving Scheme). కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ పథకాన్ని ప్రారంభించింది. పేరుకు తగ్గట్లే, బాలికల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన & నిర్వహిస్తున్న స్కీమ్ ఇది. ఈ పథకం కింద మీరు జమ చేసే మొత్తంపై కొంత వడ్డీని సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజన ఖాతా మీద ఏడాదికి 8.20% వడ్డీ రేటును (Sukanya Samriddhi Account Interest Rate 2024) కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపదికన మారవచ్చు.
ప్రతి నెల ఐదో తేదీ నుంచి ఆ నెలాఖరు వరకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కిస్తారు. ఆ వడ్డీని ఆ ఆర్థిక సంవత్సరం తర్వాత అకౌంట్‌లో జమ చేస్తారు.
SSY ప్రయోజనాలు (Sukanya Samriddhi Yojana Benefits)
– సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ పథకం కాబట్టి, దీనిలో జమ చేసే డబ్బుకు నష్ట భయం ఉండదు.
– ఈ అకౌంట్ మీద ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది.
– ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C of the Income Tax Act) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో SSY అకౌంట్‌లో జమ చేసిన మొత్తంపై రూ.1.50 లక్షల వరకు టాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
– సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా వచ్చే వడ్డీ మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు (Tax-free).
SSY ఇతర వివరాలు (Sukanya Samriddhi Yojana Details)
– సుకన్య సమృద్ధి యోజన కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్లల కోసం బ్యాంక్/పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు.
– ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ట పరిమితి 21 సంవత్సరాలు.
– ఆడపిల్లకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకే SSY ఖాతాలో పెట్టుబడి పెట్టడం వీలవుతుంది. ఆ తర్వాత డబ్బు జమ చేయలేరు.
– సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
– SSY ఖాతాలో జమ చేసిన డబ్బును ఆడపిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పాక్షికంగా, 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.
SSY ద్వారా రూ.70 లక్షలు సంపాదించడం ఎలా?
మీ కుమార్తెకు ఏడాది వయస్సున్నప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచి, ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు (నెలకు రూ.12,500) పెట్టుబడి పెడితే, SSY కాలిక్యులేటర్ ప్రకారం, అకౌంట్ మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.70 లక్షలు (ప్రస్తుత రేట్ ప్రకారం కచ్చితంగా రూ.69.27 లక్షలు) మీ చేతికి వస్తుంది. ఇందులో మీ పెట్టుబడి మొత్తం రూ.22.50 లక్షలు అయితే… 8.20% రేట్ ప్రకారం రూ.46.77 లక్షలు వడ్డీ వస్తుంది. మొత్తం కలిపితే, రూ.69.27 లక్షలు అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: అమెరికాలో చీప్‌గా దొరుకుతున్న గోల్డ్ – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే