Sports

IPL 2024 CSK vs RCB Chepauk Statdium records


IPL 2024 Chepauk Statdium record: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2024) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. మార్చి 22న ఐపీఎల్‌ మహా సమరం ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే తొలి దశ మ్యాచ్‌ల కోసం క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఆ చెత్త రికార్డును కోహ్లీ దాటేస్తాడా
చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌… రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. చెపాక్‌ స్టేడియంలో కోహ్లీ టీంకు చాలా చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది. 2008లో మాత్రమే బెంగళూరు.. చెన్నైని ఓడించింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లోనూ చెన్నైపై ఆర్సీబీ గెలవలేదు. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్‌ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. అయితే ఈసారి చెన్నైకు బెంగళూరు చెక్‌ పెడుతుందని అభిమానులు గంపెడాశలతో ఉన్నారు. మహిళల జట్టు ఇప్పటికే WPL టైటిల్‌ గెలచుకుందని… ఇక ఆర్సీబీ కూడా తమ ఆశలను నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ధోనీతోనే అసలు యుద్ధం
కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. IPLలో ఎంఎస్ ధోనీ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గానూ ధోనీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు.

ఇండియన్స్‌  ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న వేళ చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో ధోనీ రిటైర్‌మెంట్ అంశం మ‌రోసారి చ‌ర్చకు వ‌చ్చింది. కొత్త సీజన్-కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండని ధోని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌తో ధోనీ మరోసారి ఆటకు వీడ్కోలు పలకునున్నాడన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. ధోని కోచ్‌గా ఉంటాడ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ధోనీ కోచింగ్ చేస్తార‌ని ఒకరు… కొత్త పాత్ర అంటే ఏమిటి అని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Hockey India CEO Elena Norman Resigns after 13 Years Leadership | Hockey India CEO Resigns: జీతం ఇవ్వ‌ట్లేదంటూ

Oknews

T20 World CUP 2024 Team of The Tournament | T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ

Oknews

WPL 2024 RCB vs UP Warriorz Sobhana Asha 5 Wickets

Oknews

Leave a Comment