Sports

IPL 2024 Dc Vs CSK Head to head records


IPL 2024 Dc Vs CSK  Head to head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో 13వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తలపడనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ Y.S. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ జరగనుంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. రుతురాజ్ గైక్వాడ్‌ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి టైటిల్‌ కల సాకారం దిశగా పయనిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో చెన్నై నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటివరకూ మొత్తం 29 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్… చెన్నైపై పదిసార్లు గెలిచింది.  గత అయిదు మ్యాచుల్లో చెన్నైపై ఢిల్లీ కేవలం ఒకే విజయం సాధించగా.. చెన్నై నాలుగు సార్లు విజయం సాధించింది.  చెన్నైతో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఘోరంగా ఓడిపోయింది. 91, 27, 77 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ చెత్త రికార్డును చెరిపేసుకోవాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది.

ఢిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్… డైరెక్టర్‌ సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్‌ కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. పృథ్వీ షా. రికీ భుయ్‌ రాణిస్తే ఢిల్లీ బ్యాటింగ్‌ కాస్త మెరుగవుతుంది. కానీ ఫిట్‌నెస్‌ పూర్తిగా సాధించని పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. డేవిడ్ వార్నర్, కెప్టెన్ రిషబ్ పంత్ గాడిన పడాల్సి ఉంది, మిచెల్ మార్ష్‌పై కూడా ఢిల్లీ ఆశలు పెట్టుకుంది. అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్, దీపక్ చాహర్, మతీషా పతిరాణ, రవీంద్ర జడేజాలతో పటిష్టంగా ఉన్న చెన్నై బౌలింగ్‌ను ఢిల్లీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.  పంత్ విఫలమైతే ధాటిగా ఆడగల దేశీయ క్రికెటర్లు లేకపోవడం ఢిల్లీని వేధిస్తోంది. ఇషాంత్‌శర్మ మళ్లీ జట్టులోకి వస్తే ఢిల్లీ బౌలింగ్‌ కాస్త మెరుగుపడుతుంది. 

జట్లు
చెన్నై: ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‍(కెప్టెన్‌), రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే,  షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్‌, సిమర్జిత్‌ సింగ్‌, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. 

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్.

మరిన్ని చూడండి



Source link

Related posts

IPL 2024 Delhi Capitals names Lizaad Williams as replacement for Harry Brook

Oknews

Ind vs Eng 5th Test Highlights: ఇన్నింగ్స్ ఓటమితో పరాభవాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్ జట్టు

Oknews

Kung Fu Pandya ఈజ్ బ్యాక్

Oknews

Leave a Comment