Sports

IPL 2024 Dc Vs CSK Match preview and prediction


IPL 2024 Dc Vs CSK Match preview and prediction : ఐపీఎల్‌(IPL)లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై(CSK) మరో సమరానికి సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చెన్నై… రిషభ్‌ పంత్‌ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఢిల్లీ… ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన చెన్నైని ఎలా అడ్డుకోగలదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే పృథ్వీ షా మళ్లీ జట్టులో చేరనుండడం ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్టం చేయనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడిన గత నాలుగు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోవడం వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.

చెన్నైతో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఘోరంగా ఓడిపోయింది. 91, 27, 77 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ చెత్త రికార్డును చెరిపేసుకోవాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. ఢిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్… డైరెక్టర్‌ సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్‌ కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. పృథ్వీ షా. రికీ భుయ్‌ రాణిస్తే ఢిల్లీ బ్యాటింగ్‌ కాస్త మెరుగవుతుంది. కానీ ఫిట్‌నెస్‌ పూర్తిగా సాధించని పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. డేవిడ్ వార్నర్, కెప్టెన్ రిషబ్ పంత్ గాడిన పడాల్సి ఉంది, మిచెల్ మార్ష్‌పై కూడా ఢిల్లీ ఆశలు పెట్టుకుంది. అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్, దీపక్ చాహర్, మతీషా పతిరాణ, రవీంద్ర జడేజాలతో పటిష్టంగా ఉన్న చెన్నై బౌలింగ్‌ను ఢిల్లీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.  పంత్ విఫలమైతే ధాటిగా ఆడగల దేశీయ క్రికెటర్లు లేకపోవడం ఢిల్లీని వేధిస్తోంది. ఇషాంత్‌శర్మ మళ్లీ జట్టులోకి వస్తే ఢిల్లీ బౌలింగ్‌ కాస్త మెరుగుపడుతుంది. 

చెన్నై బ్యాటింగ్ కూడా…
రచిన్‌ రవీంద్ర, రహానే, రుతురాజ్‌, ధోనీ, రవీంద్ర జడేజాలతో కూడా చెన్నై బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ధోనీ మార్గనిర్దేశనం చెన్నైకి బాగా కలిసి వస్తోంది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌ చెన్నైకు ప్రధాన బలం. చెన్నైకి పెద్దగాసమస్యలు ఏమీ లేవు. 
జట్లు
చెన్నై: ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‍(కెప్టెన్‌), రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే,  షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్‌, సిమర్జిత్‌ సింగ్‌, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. 

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్.

మరిన్ని చూడండి



Source link

Related posts

Pat Cummins Dhoni Uppal Stadium SRH IPL 2024: సీఎస్కేపై విజయం తర్వాత కమిన్స్ అలా ఎందుకు అన్నాడు?

Oknews

Vinesh Phogat accuses WFI of trying to end her Olympic dream

Oknews

Ishant Sharma Yorker to Russell | Ishant Sharma Yorker to Russell | DC vs KKR మ్యాచ్ లో ఇషాంత్ యార్కర్ కు రస్సెల్ బౌల్డ్

Oknews

Leave a Comment