Sports

IPL 2024 KKR vs RR Head to Head Records


IPL 2024 KKR vs RR Head to Head Records: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరం జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్… రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 31వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో రెండు జట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉండగా, కోల్‌కత్తా పట్టికలో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్‌-కోల్‌కత్తా మధ్య ఇది మూడో మ్యాచ్‌. వేదికపైనే యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేశాడు. కోల్‌కత్తాకు బలమైన బ్యాటింగ్‌ 
లైనప్‌ ఉంది. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ దూకుడుగా ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్,  రింకూ సింగ్ వంటి బ్యాటర్లు ఉన్నారు. కోల్‌కత్తాకు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలతో కోల్‌కత్తాకు బలమైన బౌలింగ్ ఉంది.

హెడ్-టు-హెడ్ రికార్డులు:
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో కోల్‌కత్తా-రాజస్థాన్‌ 28 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో కోల్‌కత్తా 14 విజయాలు నమోదు చేయగా..  రాజస్థాన్‌ 13 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. రాజస్థాన్‌పై అప్పటి కోల్‌కత్తా ప్లేయర్‌ దినేష్ కార్తీక్ అత్యధిక పరుగులు నమోదు చేశాడు. కార్తిక్‌ 8 మ్యాచుల్లో 68 బ్యాటింగ్ సగటుతో 150.28 స్ట్రైక్ రేట్‌తో 272 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. KKRలో ప్రస్తుత బ్యాటర్లలో నితీష్ రాణా 11 ఇన్నింగ్స్‌ల్లో 24.89 బ్యాటింగ్ సగటుతో 224 పరుగులు చేశాడు. రాజస్థాన్‌పై శివమ్‌ మావి కోల్‌కత్తా తరపున ఆడుతూ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 8 మ్యాచ్‌ల్లో  మావి 13 వికెట్లు పడగొట్టాడు. కోల్‌కత్తా ప్రస్తుత బౌలర్లలో, స్టార్ స్పిన్నర్ సునీల్‌ నరైన్‌ 18 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. 

అత్యధిక పరుగులు
2022లో రాజస్థాన్‌పై కోల్‌కత్తా 210 పరుగులు నమోదు చేసింది. ఇదే రాజస్థాన్‌పై కోల్‌కత్తాకు అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓడిపోయింది. కోల్‌కత్తా తరఫున శ్రేయస్ అయ్యర్, ఆరోన్ ఫించ్ అర్ధ సెంచరీలు చేశారు. 2013లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో కోల్‌కత్తా కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. ఇదే అత్యల్ప స్కోరు. 

జట్లు: 
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.

మరిన్ని చూడండి



Source link

Related posts

World Cup 2023: అట్లుంటది మనతోని, బార్మీకి ఆర్మీకి ఇచ్చి పడేసిన అభిమానులు

Oknews

Shreyas Iyer And Ishan Kishan Vs BCCI How The Unprecedented Faceo Ff Happened And Its Impact

Oknews

South Africa Reaches Top Spot In World Cup 2023 Points Table Check Details | World Cup Points Table: పాయింట్ల పట్టికలో తిరిగి టాప్‌ ప్లేస్‌కు సౌతాఫ్రికా

Oknews

Leave a Comment