Sports

IPL 2024 KKR vs RR Rajasthan Royalstarget 224


Rajasthan Royalstarget 224 : రాజస్థాన్‌(RR)తో  జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా(KKR) ఓపెనర్‌ సునీల్‌ నరైన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతక గర్జన చేశాడు. మిగిలిన బ్యాటర్లు క్రీజులో నిలదుక్కొకునేందుకు ఇబ్బందిపడుతున్న చోట నరైన్‌ అద్భుతమే చేశాడు. నరైన్‌ విధ్వంసంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్ల అయిదు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ 2, కుల్దీప్‌ సేన్‌ 2, బౌల్ట్‌, యుజ్వేంద్ర చెరో వికెట్‌ తీశారు

 

నరైన్‌ ఒక్కడే…

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే సాల్ట్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రియాన్‌ పరాగ్ జార విడిచాడు. ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ అవుటయ్యాడు. అవేశ్‌ సూపర్‌ రిట్నర్ క్యాచ్‌తో సాల్ట్‌ అవుటయ్యాడు. కేవలం పది పరుగులే చేసి సాల్ట్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రఘువంశీతో కలిసి నరైన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవర్‌లో రఘువంశీ మూడు బౌండరీలు బాదేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కత్తా ఒక వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. రఘువంశీ, నరైన్ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సిక్సర్‌తో సునీల్ నరైన్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ వేసిన పదో ఓవర్‌లో ఐదో బంతికి సునీల్ నరైన్ సిక్సర్‌ బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్‌ విధ్వంసంతో 10 ఓవర్లకు స్కోరు కోల్‌కతా ఒక వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. రఘువంశీ 18 బంతుల్లో 30 పరుగులు చేసి అవుటయ్యాడు. కుల్దీప్‌ సేన్ వేసిన 10.4 ఓవర్‌కు అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి రఘువంశీ అవుటయ్యాడు. అశ్విన్ వేసిన 12 ఓవర్‌లో నరైన్‌ రెండో బంతికి సిక్స్‌, తర్వాతి బంతికి ఫోర్, లాస్ట్ బౌల్‌కు బౌండరీ సాధించాడు. ఓపక్క నరైన్‌ నిలబడ్డా మరోపక్క కోల్‌కతా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 11 పరుగులే చేసి అవుటయ్యాడు. చాహల్‌ వేసిన 13 ఓవర్‌లో ఐదో బంతికి సిక్స్‌ కొట్టిన అయ్యర్‌.. చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నరైన్‌ సెంచరీ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. యుజ్వేంద్ర చాహల్‌ వేసిన 16వ ఓవర్లో మొత్తం 23 పరుగులొచ్చాయి. నరైన్‌ ఈ ఓవర్లో 2 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు. మొత్తానికి నరైన్ 56 బాల్స్ లో 13 ఫోర్ లు 6 సిక్స్ లతో 109 పరుగులు చేశాడు.  అవేశ్‌ఖాన్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతికే రసెల్‌ ఔటయ్యాడు. రింకుసింగ్‌ 9 బంతుల్లో 20 పరుగులు చేసాడు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

ఆ రోజు రోహిత్ ఫోన్ చేయకుంటే ఈ రోజు అనేది లేదు..!

Oknews

WPL 2024 RCB Vs GG Royal Challengers Bangalore Win By 8 Wickets

Oknews

Updated World Test Championship Table After Indias Historic Win Over England In Rajkot

Oknews

Leave a Comment