IPL 2024 LSG vs GT : ఐపీఎల్(IPL)లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్(GT)తో లక్నో సూపర్ జెయింట్స్(LSG) అమీతుమీ తేల్చుకోనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో తమ విజయాల జోరును కొనసాగించాలని రాహుల్ సేన చూస్తోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లక్నో పేస్ సెన్సేషన్ మాయంక్ యాదవ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైన వేళ… లక్నో పేస్‌కు.. గుజరాత్ బ్యాటర్లకు రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన లక్నో మూడో గెలుపుపై కన్నేసింది. కొత్త పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని సత్తా చాటడం లక్నోకు వరంలా మారింది. ఇక గుజరాత్ టైటాన్స్ లో వృద్ధిమాన్ సాహాకు బదులుగా బి ఆర్ శరత్ తొలిసారి బరిలో దిగనున్నాడు.
గుజరాత్ సమస్యలు తీరేనా..?
కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్‌కు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రెండు మ్యాచులు గెలిచి రెండు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో గుజరాత్ ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో 48 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేసిన గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. అదే ఫామ్ కొనసాగించాలని గిల్ చూస్తున్నాడు. సాయి సుదర్శన్ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే భారీ స్కోర్లు నమోదు చేయాలని సుదర్శన్ కన్నేశాడు.
చూపంతా మాయంక్‌పైనే
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల మాయంక్ యాదవ్ తొలి మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను తన పేస్‌తో ఆశ్చర్యపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3/14 గణాంకాలతో ఆర్సీబీ ఓటమికి ప్రధామ కారణమయ్యాడు. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను 151 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఆశ్చర్యపరిచాడు.
హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్‌తో గుజరాత్ నాలుగుసార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గుజరాత్ టైటాన్స్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకూ ఓడిపోలేదు. 2022 ఛాంపియన్ అయిన గుజరాత్… లక్నోతో మొత్తం నాలుగు సార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గురజాత్ గెలిచింది. ఎకానా స్టేడియంలో 30-32° ఉష్ణోగ్రత ఉంటుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రెండు జట్లు ఒకేసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 135 పరుగులు చేసి… లక్నోను 128/7 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది.
లక్నో జట్టు(అంచనా): క్వింటన్ డి కాక్, KL రాహుల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్
గురాజత్ జట్టు (అంచనా):, శుభమాన్ గిల్( కెప్టెన్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే
మరిన్ని చూడండి