Sports

IPL 2024 LSG vs GT Head to Head records


IPL 2024 LSG vs GT  Head to Head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 సీజన్‌ 21వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో  తమ విజయాల జోరును కొనసాగించాలని రాహుల్‌ సేన చూస్తోంది. లక్నో పేస్‌ సెన్సేషన్ మాయంక్‌ యాదవ్‌పై అందరి దృష్టి  కేంద్రీకృతమైన వేళ… లక్నో పేస్‌కు.. గుజరాత్‌  బ్యాటర్లకు రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బుల్లెట్లల దూసుకొచ్చే బంతులతో కచ్చితత్వంతో అభిమానులను, విమర్శకులను మయాంక్‌ యాదవ్‌ మెస్మరైజ్ చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ మయాంక్‌ రాణిస్తాడని లక్నో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.

హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్‌తో గుజరాత్‌ నాలుగుసార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గుజరాత్ టైటాన్స్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకూ ఓడిపోలేదు. 2022 ఛాంపియన్‌ అయిన గుజరాత్‌… లక్నోతో మొత్తం నాలుగు సార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గురజాత్‌ గెలిచింది. ఎకానా స్టేడియంలో 30-32° ఉష్ణోగ్రత ఉంటుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ  రెండు జట్లు ఒకేసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 135 పరుగులు చేసి… లక్నోను 128/7 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది. 

చూపంతా మాయంక్‌పైనే 
కొత్త పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని సత్తా చాటడం లక్నోకు వరంలా మారింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల మాయంక్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను తన పేస్‌తో ఆశ్చర్యపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3/14 గణాంకాలతో ఆర్సీబీ ఓటమికి ప్రధామ కారణమయ్యాడు. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను 151 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఆశ్చర్యపరిచాడు. మయాంక్‌ యాదవ్‌ అద్భుతమైన ప్రదర్శనలు… ఈ మ్యాచ్‌లో చూపంతా అతడిపైనే ఉండేలా చేశాయి. లక్నో ఓపెనింగ్‌ జోడీ క్వింటన్ డి కాక్-  KL రాహుల్‌లు మరోసారి భారీ భాగస్వామ్యం నెలకొల్పాలని చూస్తున్నారు. 

లక్నో జట్టు(అంచనా): క్వింటన్ డి కాక్, KL రాహుల్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్

గురాజత్‌ జట్టు (అంచనా): వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్( కెప్టెన్‌), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే

మరిన్ని చూడండి



Source link

Related posts

Sourav Gangulys Exciting March 5 Revelation On Rishabh Pants IPL Return

Oknews

IPL 2024 MI vs CSK Preview and Prediction

Oknews

Sunrisers Hyderabad Pat Cummins IPL 2024: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో.. పేరు ఎలా ఉందో..?

Oknews

Leave a Comment