Sports

IPL 2024 MS Dhoni Takes Stunning Catch To Bring Chepauk Comes Alive During CSK vs GT


 MS Dhoni Turns Back The Clock, Takes 0.6 Secs To Take Stunning Catch: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2024(IPL2024) లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), గుజరాత్ టైటాన్స్(GT) పోరులో చెన్నై జట్టు ఘ‌న విజ‌యం సాధించింది. గుజరాత్‌ మ్యాచ్‌లో మిస్టర్‌  కూల్‌, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ… అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. 42 ఏళ్ల వయసులో ధోనీ పట్టిన ఈ క్యాచ్‌తో స్టేడియం దద్దరిల్లిపోయింది. విజయ్ శంకర్ 12 బంతుల్లో ఒక సిక్సర్ సహా 12 పరుగులు మాత్రమే చేసి, వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. విజ‌య్ శంక‌ర్ ఇచ్చిన క్యాచ్ ను ప‌ట్టుకోవ‌డానికి ఎంఎస్ ధోని సింహంలా దూకాడు. 42 ఏళ్ల వయసులో ధోనీ సూపర్‌గా డైవింగ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. 42 ఏళ్ల వయసు ఒక అంకే మాత్రమేనని మహీ బాయ్‌ నిరూపించాడు. ధోని అందుకున్న ఈ క‌ళ్లుచెదిరే క్యాచ్‌కు స్టేయిడం హోరెత్తిపోయింది.  ప‌ట్టుకున్నాడు. అద్భుత‌మైన‌ క్యాచ్ పట్టడంతో అభిమానులంతా ధోని.. ధోని అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మాములుగా లేదు. ధోనీని సింహం, పులితో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ లు వెళ్లువెత్తుతున్నాయి. ధోనీ వావ్‌, ధోనీ గ్రేట్‌, ధోనీని మించి కీపర్‌ లేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

రెండో విజయం
 ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె అర్థ సెంచరీతో చెలరేగగా రచీన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్‌ చెరో 46 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో  రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో  గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్‌ 37, సాహా 21, మిల్లర్‌ 21 పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపర్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ తలో రెండు వికెట్లు తీయగా, డారిల్ మిచెల్, పతిరన ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

 మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది. తొలుత చెరో జీవన దానం లభించడంతో రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్‌ చెలరేగిపోయారు. రచిన్‌ వరుసగా బౌండరీలు, సిక్సులు బాదాడు. క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన రచిన్ రవీంద్ర… ఎడాపెడా బౌండరీలు బాదతూ గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 5 ఓవర్లకు చెన్నై స్కోరు 58/0 పరుగులకు చేరింది. రచిన్‌ రవీంద్ర జోరుకు రషీద్‌ ఖాన్‌ బ్రేక్‌ వేశాడు. 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేసి రచిన్‌ అవుటయ్యాడు. రషీద్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా రచిన్‌ వెనుదిరిగాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 69/1కు చేరింది. అనంతరం రహానే, రుతురాజ్‌ స్కోరు బోర్డును నడిపించారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై స్కోరు వంద పరుగులు దాటింది. కానీ కాసేపటికే 12 పరుగులు చేసిన రహాన్‌ అవుటయ్యాడు. సాయి కిషోర్ వేసిన 11 ఓవర్లో రహానే స్టంపౌటయ్యాడు. క్రీజులోకి రావడంతోనే శివమ్‌ దూబె రెండు సిక్సర్లు బాదాడు. కానీ 36 బంతుల్లో 46 పరుగులు చేసిన రుతురాజ్‌ జాన్సన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Indias Chess prodigy features in Nirmala Sitharamans Interim Budget speech

Oknews

రాధికా అనంత్ పెళ్లి కోసం మహేంద్ర సింగ్ ధోనీ.!

Oknews

India Women Pip South Africa In High Scoring Thriller At Chinnaswamy To Clinch Odi Series 2 0

Oknews

Leave a Comment