Sports

IPL 2024 PBKS vs MI Punjab target 193


IPL 2024 PBKS vs MI Punjab target 193:  పంజాబ్‌ కింగ్స్‌(PBKS)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌(MI)  భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై… సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌వర్మ, రోహిత్‌ శర్మ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. 53 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో సూర్యా భాయ్‌ 78 పరుగులు చేశాడు.

 

సూర్య, తిలక్‌ ధాటిగా..

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ శామ్‌ కరణ్‌… ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్‌ను స్పిన్నర్‌ చేత వేయించిన శామ్‌ కరణ్‌… ముంబై బ్యాటర్లకు విభిన్నంగా స్వాగతం పలికాడు. తొలి రెండు ఓవర్లలో ఎలాంటి వికెట్‌ రాకపోయినా ముంబై స్కోరు 18కి చేరింది. మూడో ఓవర్‌ తొలి బంతికే ఇషాన్‌ కిషన్‌ను అవుట్‌ చేసిన పంజాబ్ స్టార్‌ పేసర్‌ రబాడ… ముంబైకు తొలి షాక్‌ ఇచ్చాడు. దీంతో 18 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం రోహిత్ శర్మతో జత కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ మరో వికెట్‌ పడకుండా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రోహిత్‌ శర్మ- సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ… 25 బంతుల్లో 2 ఫోర్లు మూడు సిక్సర్లతో 36 పరుగులు చేసి శామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 99 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ అవుటైనా సూర్యకుమార్ యాదవ్‌ ఎదురుదాడి కొనసాగించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 34 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. తర్వాత తిలక్‌ వర్మ-సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా మంచి భాగస్వామ్యమే నెలకొల్పారు. సెంచరీ దిశగా సాగుతున్న సూర్య భాయ్‌ను అవుట్‌ చేసి శామ్ కరణ్‌… ముంబైను మరో దెబ్బ తీశాడు.   53 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో సూర్యా భాయ్‌ 78 పరుగులు చేసి సూర్య పెవిలియన్‌ చేరాడు. తర్వాత తిలక్‌ వర్మ కూడా ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. కానీ ముంబై ఇండియన్స్‌ సారధి హార్దిక్‌ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు. ఆరు బంతుల్లో పది పరుగులు చేసి హార్దిక్‌… హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో తిలక్‌ వర్మ, టిమ్ డేవిడ్‌ మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 34 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో శామ్‌ కరణ్‌ 2, అర్ష్‌ పటేల్‌ 2, రబాడ ఒక వికెట్‌ తీశారు.   

 

పంజాబ్‌ పుంజుకుంటుందా..?

భుజం గాయం కారణంగా పది రోజుల పాటు జట్టుకు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో టాప్‌ ఆర్డర్‌లో పంజాబ్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. భారత దేశీయ ఆటగాళ్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు రాణిస్తుండడం పంజాబ్‌కు కాస్త ఊరట కలిగిస్తోంది. వీరిద్దరూ క్రీజులో నిలబడి పరుగులు సాధిస్తుండడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌ లోపాలు బహిర్గతం కావడం లేదు. ఆరు మ్యాచ్‌ల్లో 19.83 సగటుతో కేవలం 119 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఫామ్ పంజాబ్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. జితేష్ శర్మ కూడా వరుసగా విఫలమవుతుండడం పంజాబ్‌కు తలనొప్పిగా మారింది. ఆరు మ్యాచుల్లో 17.66 సగటుతో జితేశ్‌ కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపికవుతాడని ఆశించిన జితేష్‌ వరుసగా విఫలమవుతుండడం పంజాబ్‌ను నిరాశ పరుస్తోంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Check Out How 2023 World Cup Points Table Becomes After India Defeats England | World Cup Points Table: పాయింట్ల పట్టికలో తిరిగి టాప్‌కు టీమిండియా?

Oknews

Olympics 2036: ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న గుజరాత్.. 600 ఎకరాల్లో పనులు ప్రారంభం

Oknews

Virat Kohli Batting T20 World Cup 2024 | Virat Kohli Batting T20 World Cup 2024 | సెమీ ఫైనల్లోనైనా కింగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా..?

Oknews

Leave a Comment