IPL 2024 Most Runs and Wickets : ఐపీఎల్ (IPL) సీజన్ 2024లో సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనంత భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. బౌలర్లు కూడా సత్తా మేరకు రాణిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఫీల్డర్ల విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. అయితే ఐపీఎల్ సగం మ్యాచులు పూర్తయిన వేళ ఇప్పటివరకూ టాప్‌లో నిలిచిన ఆటగాళ్ల వివరాలు తెలుసుకుందాం….
టాప్ స్కోరర్లు వీళ్లే
ఐపీఎల్‌లో బెంగళూరు పరాజయాల పరంపరతో ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినా కింగ్ కోహ్లీ పరుగుల ప్రవాహం మాత్రం ఆగలేదు. బెంగళూరు జట్టులో స్ధిరంగా రాణించిన ఒకే ఒక్క బ్యాటర్ విరాట్ కావడం విశేషం. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ అగ్రస్థానంలో ఉన్నాడు. బెంగళూరు ఓపెనర్ విరాట్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 63.17 యావరేజ్‌తో 379 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఇప్పుడు విరాట్ వద్దే భద్రంగా ఉంది. ఈ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ నిలిచాడు. బట్లర్ ఇప్పటికే ఈ ఐపీఎల్‌లో రెండు శతకాలు చేశాడు. ముగ్గురు ఆటగాళ్లు అత్యధిక హాఫ్ సెంచరీలు చేశారు. రియాన్ పరాగ్, శాంసన్, క్లాసెన్, డికాక్ మూడు అర్ధ శతకాలతో మెరిశారు. బ్యాటింగ్‌లో అత్యధిక యావరేజ్ 141తో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉండగా… అత్యధిక స్ట్రైక్ రేట్ 280 కలిగిన ఆటగాడిగా రొమారియో షెపర్డ్ నిలిచాడు. ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సన్‌రైజర్స్ ఆటగాడు క్లాసెన్ నిలిచాడు. క్లాసెన్ ఈ ఐపీఎల్‌లో ఇప్పటికే 26 సిక్సర్లు బాదేశాడు. ట్రానిస్ హెడ్ అత్యధికంగా 39 బౌండరీలు కొట్టాడు.
బౌలింగ్‌లో బుమ్రానే..
బౌలింగ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా 13 వికెట్లతో బుమ్రాతో సమంగా ఉన్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు ఇచ్చే పర్పుల్ క్యాప్‌ను వీరిద్దరూ పంచుకుంటున్నారు. ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సందీప్ శర్మ నమోదు చేశాడు. సందీప్ 18 పరుగులకే అయిదు వికెట్లు తీశాడు. సందీప్‌తోపాటు బుమ్రా, యశ్ ఠాకూర్ కూడా అయిదు వికెట్లు ప్రదర్శన చేశారు.
సగం మ్యాచ్‌లు పూర్తి
ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ కోసం అసలు యుద్ధం ప్రారంభం కానుంది. దీని కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. మొత్తం 74 మ్యాచ్‌ల ఈ ఐపీఎల్ లీగ్‌లో సగం సీజన్ పూర్తయింది. అప్పుడే లీగ్‌లో 38 మ్యాచ్‌లు పూర్తయిపోయాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. వన్డేల్లో మాదిరిగా 270, 280 స్కోర్లు చేస్తూ ‘మిషన్ 300’ను పూర్తిచేసే దిశగా ఐపీఎల్ సాగుతోంది. ఈ మిషన్‌ను పూర్తి చేసే బాధ్యతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన సన్‌రైజర్స్…300 పరుగులే తమ మిషన్‌గా ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 8.99 రన్‌రేట్‌తో ‘ఐపీఎల్‌లో మోస్ట్ హైస్కోరింగ్ సీజన్’గా 2024 రికార్డులకెక్కింది.తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన సన్‌రైజర్స్…300 పరుగులే తమ మిషన్‌గా ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 8.99 రన్‌రేట్‌తో ‘ఐపీఎల్‌లో మోస్ట్ హైస్కోరింగ్ సీజన్’గా 2024 రికార్డులకెక్కింది.
మరిన్ని చూడండి