Sports

IPL 2024 RCB vs KKR Kolkata Knight Riders chose to field


Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders:  ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరం జరుగుతోంది. బెంగళూరు(RCB)తో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(KKR) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కత్తా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు కావాలని.. విరాట్‌ విశ్వరూపం చూడాలని క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరుకు ఇది మూడో మ్యాచ్‌కాగా… కోల్‌కత్తాకు ఇది రెండో మ్యాచ్‌. తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా… సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి మంచి ఫామ్‌లో ఉండగా… తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడినా… రెండో మ్యాచ్‌లో పంజాబ్స్‌పై గెలిచి బెంగళూరు కూడా జోరు మీద ఉంది.

సోషల్‌ మీడియాలో రచ్చ
ఐపీఎల్‌లో ఆర్సీబీ- కేకేఆర్ సమరాన్ని అభిమానులు హై వోల్టెజ్ మ్యాచ్‌గా భావిస్తారు. గతంలో పలుమార్లు గంభీర్- విరాట్ మధ్య జరిగిన వివాదాలే ఇందుకు కారణం. అందుకే ఈ మ్యాచ్‌ను బెంగళూరు-కోల్‌కత్తా మ్యాచ్‌ల కాకుండా గంభీర్- కోహ్లీ మధ్య ఫైట్‌లా చూస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌కు సంబంధించి మీమ్స్  ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇరుజట్ల అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కోహ్లీపైనే భారమంతా..?
ఈ మ్యాచ్‌లో కోహ్లీపైనే అందరి కళ్లు కేంద్రీకృతమై ఉంది. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై విరాట్‌… విక్టరీ ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించాడు. సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుండడం బెంగళూరుకు కలిసిరానుంది. విరాట్‌ కోహ్లీతో పాటు దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ రూపంలో పవర్ హిట్టింగ్‌లతో బెంగళూరు బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా ఉంది. కార్తీక్, లోమ్రోర్‌ల జోడీ గత మ్యాచ్‌లోనూ రాణించడం బెంగళూరుకు కలిసి రానుంది. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్‌లతో కూడిన బెంగళూరు బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. పేస్‌లో బెంగళూరు కాస్త బలంగా కనిపిస్తున్నా స్పిన్ విభాగంలో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో రాణిస్తున్నా…. బ్యాటింగ్‌లో విఫలం కావడం బెంగళూరు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తమ విజయాల పరంపరను కొనసాగించేందుకు ఆర్సీబీ ఎదురుచూస్తోంది.

కోల్‌కత్తా జోరు సాగేనా..?
విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌తో బలంగా ఉంది. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ ఓపెనర్ల జోడి మారే అవకాశం ఉంది. కోల్‌కత్తాను ఓపెనింగ్‌ సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓపెనింగ్ స్థానంపై కోల్‌కత్తా ప్రయోగాలు చేస్తూనే ఉంది. రింకూ సింగ్ కోల్‌కత్తాకు మంచి ఫినిషర్‌ దొరికాడు. బౌలింగ్ విషయానికి వస్తే, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తితో కోల్‌కత్తా స్పిన్‌ విభాగం బలంగా ఉంది. బ్యాటర్లు, బౌలర్లతో పటిష్టంగా ఉన్న కోల్‌కత్తాతో బెంగళూరుకు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

 

మరిన్ని చూడండి



Source link

Related posts

PCB May Restore Haris Raufs Central Contract

Oknews

దమ్ము చూపించటానికి దమ్మే కొట్టాలా షారూఖ్ భాయ్.!

Oknews

IPL Venues in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ వేదికలు సిద్ధం, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు మీరు సిద్ధమా!

Oknews

Leave a Comment