Sports

IPL 2024 RCB vs PBKS LIVE Score Updates Royal Challengers Bengaluru restrict Punjab Kings to 176for 6 | RCB vs PBKS LIVE Score: రాణించిన బెంగళూరు బౌలర్లు


IPL 2024 RCB vs PBKS LIVE Score Updates:  చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తేలిపోయిన బెంగళూరు(RCB) బౌలర్లు రెండో మ్యాచ్‌లో రాణించారు. చిన్నస్వామి వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో పంజాబ్‌(PBKS)ను ఓ మోస్తరు పరుగులకే కట్టడి చేశారు. చిన్న మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ను 176 పరుగులకే  కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు విజయవంతమయ్యారు. పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో6వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌ 2, సిరాజ్‌ 2, యశ్‌ దయాల్‌ ఒకటి, జోసెఫ్‌ ఒక వికెట్‌ తీశారు.

 

కట్టుదిట్టంగా బౌలింగ్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ శిఖర్‌ ధావన్‌ మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే బౌండరీ సాధించాడు. మహ్మద్‌ సిరాజ్ వేసిన తొలి ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. తొలి ఓవర్‌లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన యశ్‌ దయాల్  కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ దశలో ఎనిమిది పరుగులు చేసిన బెయిర్‌ స్టోను సిరాజ్‌ అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన బెయిర్‌ స్టో.. మూడో మూడో బంతికి కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్‌ స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 40 పరుగులకు చేరింది. తర్వాత శిఖర్‌ ధావన్‌ దూకుడు పెంచాడు. మయాంక్ దగార్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో ఐదు సింగిల్స్‌ రాగా.. ధావన్‌ ఓ సిక్స్‌ బాదాడు. ఈ దశలో పంజాబ్‌ను మ్యాక్స్‌వెల్ దెబ్బకొట్టాడు. తన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఓవర్‌లో తొలి బంతికి ధావన్‌ ఫోర్ కొట్టగా నాలుగో బంతికి ప్రభ్‌సిమ్రాన్ సిక్స్ బాదాడు. తర్వాతి బంతికే 25 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్‌ వికెట్ కీపర్‌ అనుజ్ రావత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 72 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్‌  ధాటిగా ఆడేందుకు యత్నించాడు. 17 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్‌ను అల్జారీ జోసెఫ్‌ అవుట్‌ చేశాడు. తర్వాత కాసేపటికే 45 పరుగులు చేసిన ధావన్ ఔట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ అవుటయ్యాడు. తర్వాత జితేశ్‌ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. మయాంక్ దగార్‌ వేసిన 15 ఓవర్‌లో జితేశ్‌ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. 15 ఓవర్లకు స్కోరు 128/4. 17 బంతుల్లో 23 పరుగులు చేసిన శామ్‌ కరణ్‌ అవుటయ్యాడు. జితేశ్‌ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

 

కోహ్లీపైనే ఆశలు

విరాట్ కోహ్లీపైనే బెంగళూరు భారీ ఆశలు పెట్టుకుంది. ఒక్కసారి కోహ్లీ ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCBకి మొదటి విజయాన్ని అందించాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటివరకూ 31 సార్లు తలపడ్డాయి.ఈ మ్యాచుల్లో బెంగళూరుపై పంజాబ్‌కే కాస్త పైచేయి కనిపిస్తోంది. మొత్తం 31 మ్యాచుల్లో పంజాబ్‌ 17 సార్లు గెలుపొందగా…బెంగళూరు 14సార్లు విజయం సాధించింది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Zeeshan Ali becomes Indias Davis Cup captain in absence of Rohit Rajpal

Oknews

Jay Shah Set To Continue As ACC President

Oknews

Pakistan Vs Bangladesh Live Streaming World Cup 2023 When And Where To Watch PAK Vs BAN

Oknews

Leave a Comment