Sports

IPL 2024 RCB vs PBKS Royal Challengers Bengaluru vs Punjab Kings Preview


Royal Challengers Bengaluru vs Punjab Kings: తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాజయం పాలైన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌(PBKS)తో జరుగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌ను తొలి గెలుపు రుచి చూడాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్న బెంగళూరు…. బౌలింగ్‌లో మాత్రం తేలిపోతుండడం ఆ జట్టును కలవరపెడుతోంది. కానీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండడం బెంగళూరుకు కలిసిరానుంది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింతే పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరుకు విజయం కష్టం కాకపోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు. 

బౌలర్లు పుంజుకుంటారా..?
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన బౌలర్లు ఈ మ్యాచ్‌లో అయినా రాణించాలని బెంగళూరు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్న చెపాక్‌ పిచ్‌పై బెంగళూరు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. మయాంక్ డాగర్, కర్ణ్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్‌… బెంగళూరు స్పిన్‌ భారాన్ని మోయనున్నారు. చెపాక్‌ స్టేడియంలో 27 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు నమోదు అయ్యాయి. ఈ మైదానంలో IPLలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 172 పరుగులు. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్,  యష్ దయాల్ గాడిన పడితే బెంగళూరు కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 9.5, జోసెఫ్ 10.3, దయాల్ 9.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. ఈమ్యాచ్‌లో వీరు గాడిన పడాల్సి ఉంది. 

బ్యాటింగ్‌లోనూ…
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  RCB ఆరు వికెట్లకు 173 పరుగులు చేసినా ఇందులోనూ లోపాలు బహిర్గతం అయ్యాయి. ఓ దశలో RCB ఐదు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో దినేష్ కార్తీక్, అనుజ్ రావత్‌ ఆర్సీబీని ఆదుకున్నారు. విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ జోరు అందుకుంటే భారీ స్కోరు ఖాయమే. రజత్ పాటిదార్ నుంచి బెంగళూరు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ స్కోరు ఆశిస్తోంది.  

ఆత్మ విశ్వాసంతో పంజాబ్‌
 తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.  ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ ఇరు జట్లు పోరాడినా చివరికి గెలుపు పంజాబ్‌నే వరించింది. శామ్‌ కరణ్‌ 63 పరుగులతో పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. లివింగ్‌ స్టోన్‌ కూడా చివరి వరకూ క్రీజులో నిలిచి పంజాబ్‌ను గెలిపించాడు. వీరందరూ మరోసారి రాణిస్తే బెంగళూరుపై పంజాబ్‌ విజయం సాధించే అవకాశం ఉంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్రియా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.

మరిన్ని చూడండి



Source link

Related posts

Sarfaraz Khan: జాతీయ జట్టుకు ఎంపికవడంపై సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ సంతోషం

Oknews

India Vs South Africa U19 World Cup Semi Final 2024 IND Win By Two Wickets To Reach Final | U-19 India Enters Final: అండర్‌ 19 ప్రపంచ కప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

Oknews

Australian Cricketer: తలకు బంతి తగిలి కుప్పకూలిన క్రికెటర్‌, వణికిపోయిన ఆస్ట్రేలియా

Oknews

Leave a Comment