Sports

IPL 2024 Rishabh Pant slapped with fine of INR 12 lakh


Rishabh Pant slapped with fine of INR 12 lakh : తొలి విజయాన్ని అందుకొని గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)తో మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు భారీగా ఫైన్‌ వేశారు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న రెండో కెప్టెన్‌గా‌ పంత్ నిలిచాడు. పంత్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫైన్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్ లో చెన్నై కి తొలి ఓటమి ఎదురైంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై పోరాడి ఓడింది. పంత్ అర్ధ శతకంతో మెరిసిన వేళ ఢిల్లీ ఈ ఐపీఎల్ లో తొలి విజయం సాధించింది. తొలుత బాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో  191 పరుగుల భారీ స్కోర్ చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 171 పరుగులే చేసింది. దీంతోచెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మెరిసిన పంత్‌

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్ తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు.  ధాటిగా ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు… ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. తుషార్ దేశ్‌పాండే రెండో ఓవర్‌లో షా రెండు సిక్సర్లు కొట్టాడు.  డేవిడ్ వార్నర్‌ దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మూడో బంతికి సిక్స్ బాదిన అతడు.. తర్వాతి రెండు బంతులను బౌండరీకి పంపాడు. ముస్తాఫిజుర్ రెహ్మన్ వేసిన ఆరో ఓవర్‌లో పృథ్వీ షా హ్యాట్రిక్ ఫోర్లు బాదేశాడు. ఇదే ఓవర్‌లో వార్నర్‌ కూడా ఓ బౌండరీ రాబట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రిషభ్‌ పంత్ ఫామ్‌లోకి రావడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. పంత్  32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో పంత్‌ 51 పరుగులు చేసి ఔటయ్యాడు. పతిరన వేసిన 19 ఓవర్‌లో వరుసగా 6,4,4 బాది 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న పంత్.. తర్వాతి బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌కు చిక్కాడు. పృథ్వీ షా, వార్నర్, పంత్‌ మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 171 పరుగులే చేసింది. దీంతోచెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.  మొత్తానికి ఢిల్లీ జట్టు ఎట్టకేలకు ఖాతా తెరిచింది. 

అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయకపోతే ఆ జట్టు కెప్టెన్‌పై మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తారు. పంత్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫైన్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గిల్‌కు కూడా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ జరిమానా బారిన పడ్డాడు. ఇదే గనుక మరోసారి పునరావృతమైతే కెప్టెన్‌ కు  రూ. 24 లక్షలు ఫైన్‌ వేస్తారు.  

మరిన్ని చూడండి



Source link

Related posts

పోరాట సింహం ఆట చూస్తావా.!

Oknews

Sunil Gavaskar Livid With BCCI Team India For Taking 3 Days To Wear Black Armbands In Memory Of Dattajirao Gaekwad

Oknews

Virat kohli as captain wins U19 worldcup in 2008

Oknews

Leave a Comment