Sports

IPL 2024 Suryakumar Yadav likely to take few more days to get match fit


 Suryakumar Yadav likely to take few more days to get match fit: ఐపీఎల్‌(IPL)లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ముంబైకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) మరికొన్ని మ్యాచ్‌లకు ముంబైకు దూరం కానున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో  మరికొన్ని మ్యాచ్‌లకు సూర్య దూరం అయినట్లు తెలుస్తోంది. మిడిలార్డర్‌లో కీలకమైన సూర్య మరిన్ని మ్యాచ్‌లకు దూరం కావడం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే అని మాజీలు అంచనా వేస్తున్నారు. సర్జరీ చేయించుకున్న సూర్యను హడావిడిగా ఐపీఎల్‌లో ఆడించి రిస్క్‌ తీసుకోలేమని బీసీసీఐ భావిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్‌ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి  వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యాడు గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్‌ అందుబాటులో లేదు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్య కోలుకుంటాడని అప్పట్లో  బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  

సూర్య విధ్వంసం… 
ఐసీసీ(ICC) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక‌ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ఇది ఇయ‌ర్ 2023(T20 Cricketer of the Year Award 2023) అవార్డును టీమిండియా(Team India) విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) గెలుచుకున్నాడు. మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుగా నిలిచి పొట్టి క్రికెట్‌లో తన మార్క్‌ చాటాడు. టీ 20లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆటగాడు సూర్యకుమార్ యాద‌వ్… జింబాబ్వే సార‌థి సికింద‌ర్ ర‌జా, న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్‌ మార్క్ చాప్‌మ‌న్, ఉగాండా సంచ‌ల‌నం అల్పేష్ ర‌మ్జానీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి ఈ అవార్డు సూర్య భాయ్‌నే వరించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 2023లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. స‌ఫారీ గడ్డపై తాజాగా సెంచ‌రీతో ఈ ఫార్మాట్‌లో నాలుగో శ‌త‌కం ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 17 ఇన్నింగ్స్‌ల్లో సూర్యా భాయ్‌ 155.95 స్ట్రైక్ రేటుతో 733 ర‌న్స్ కొట్టాడు. 

ఐసీసీ టీ 20 జట్టు కెప్టెన్‌గానూ…
టీమిండియా(Team India) టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav)కు అరుదైన గౌరవం దక్కింది. టీ 20 క్రికెట్‌లో మెరుపులు మెరిపించే ఈ విధ్వంసకర ఆటగాడిని 2023 ఐసీసీ టీ 20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ప్రతి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(International Cricket Council).. క్రికెట్లోని ప్రతి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో టీంలను ప్రకటిస్తుంది. 2023 సంవత్సరానికిగానూ అంతర్జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్‌ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ప్రకటించిన 2023 టీ20 జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ , స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. గత ఏడాది టీ 20ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు.

మరిన్ని చూడండి



Source link

Related posts

NZ Vs AFG World Cup 2023: New Zealand Beats Afghanistan By 149 Runs, AFG Allout For 139

Oknews

IPL 2024 RR vs RCB Rajasthan Royals won by 6 wkts

Oknews

గొడవలు కాదు..ముద్దులు ఉన్నాయి. పాండ్యా మీద రోహిత్ ప్రేమ చూడండి..

Oknews

Leave a Comment