RCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ‘GOVINDAM’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ అక్టోబరు 23, 2023వ తేదీన అందుబాటులో ఉంది.