James Anderson becomes oldest fast bowler to play Test in India: వైజాగ్(Vizag) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్(England) వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) అరుదైన ఘనత సాధించాడు. దాదాపు ఆరు నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన అండర్సన్ 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. 2003లో కెరీర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ అరుదైన రికార్డు సృష్టించాడు. 41 ఏళ్ల 187 రోజుల వయసులో అండర్సన్ భారత్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడాడు. దీంతో ఈ వయసులో భారత్‌లో మ్యాచ్ ఆడిన అత్యంత పెద్ద పేసర్‌గా అండర్సన్ నిలిచాడు. ఈ క్రమంలో 72 ఏళ్ల పాత రికార్డ్‌ను అండర్సన్ బ్రేక్ చేశాడు.
1952లో టీమ్ఇండియా ప్లేయర్ లాలా అమర్నాథ్ 41 ఏళ్ల 92 రోజుల వయసులో భారత్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. భారత్‌లో లో టెస్టు మ్యాచ్ ఆడిన త్యంత పెద్ద వయసు పేసర్ల జాబితాలో అండర్సన్, అమర్‌నాథ్ తర్వాత రే లిండ్‌వాల్( వాల్- 38 ఏళ్ల 112 రోజులు) షుట్ బెనర్జీ( 37 ఏళ్ల 124 రోజులు) గులమ్ గార్డ్(34 ఏళ్ల 20 రోజులు) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో అండర్సన్ శుభ్‌మన్ గిల్‌ను పెవిలియన్ చేర్చాడు. మొత్తం 17 ఓవర్లు బౌలింగ్ చేసిన అండర్సన్ 1.80 ఎకనమీతో 30 పరుగులిచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అందులో 3 మెయిడెన్లు ఉన్నాయి.
తొలి రోజు భారత్ దే….
వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్(yashasvi jaiswal) అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ… అజేయ శతకంతో టీమిండియాను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. యశస్వి జైస్వాల్ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్… 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్‌కు తోడుగా అశ్విన్ అయిదు పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
తొలిరోజు ఆటంతా జైస్వాల్‌దే…
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అద్భుతమైన ఆట తీరుతో దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్… సొంతగడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లి ఈ ఘనత సాధించారు. యశస్వితో సహా వీళ్లంతా రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకే ఆడటం విశేషం.
టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్… 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 2, అహ్మద్ 2, అండర్సన్ 1, హార్ట్‌లీ ఒక్క వికెట్ తీశారు.