షెడ్యూల్ ఇదే…
నాలుగోదశ వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ ఉంటుందని జనసేన పార్టీ తెలిపింది. వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగిస్తారని వెల్లడించింది. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని అక్టోబరు 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నేతలతో సమావేశం కానున్నారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని పార్టీ ప్రకటించింది. అక్టోబరు 4వ తేదీన పెడన, 5వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు తెలిపింది.