GossipsLatest News

Jr NTR and Trivikram getting mobbed by fans ఫాన్స్ ఏంటండీ ఇంత వైలెంట్ గా ఉన్నారు



Wed 10th Apr 2024 12:12 PM

jr ntr  ఫాన్స్ ఏంటండీ ఇంత వైలెంట్ గా ఉన్నారు


Jr NTR and Trivikram getting mobbed by fans ఫాన్స్ ఏంటండీ ఇంత వైలెంట్ గా ఉన్నారు

స్టార్ హీరోల అభిమానులు తమ హీరోని చూస్తే ఎంతెలా గోల చేస్తారో తరచూ చూస్తూనే ఉంటాము. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరో కనిపిస్తే వారు అస్సలు ఊరుకోరు. ఆ హీరోని కలవాలని, ఫోటో దిగాలని, జస్ట్ ముట్టుకుంటే చాలని అనుకుంటారు. ఆ హీరోని చూడగానే జై జై లు పలుకుతూ, సెల్ఫీల కోసం ఎగబడుతూ గోల గోల చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అది టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

ఎన్టీఆర్ ఈవెంట్ కి కారా వ్యాన్ దిగి లోపలి వచ్చేందుకు చాలా కష్టపడ్డాడు. ఇక ఈవెంట్ కి వచ్చాకా ఆయన అభిమానులు ఇతర స్టార్స్ ని అంటే అనుపమ పరమేశ్వరన్ ఇలా ఎవ్వరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటూ గోల గోల చేస్తూనే ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా అభిమానులని శాంతింప జెయ్యడానికి చాలా కష్టపడ్డాడు. 

ఎన్టీఆర్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే దేవర అప్ డేట్స్ కూడా అందించాడు. అయితే ఈవెంట్ అయ్యి వెళ్లిపోయే సమయంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ లు కార్ ఎక్కేందుకు వెళుతుండగా.. ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళని నడనివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ ని బౌన్సర్లు ఎంతగా కాపాడుతున్నా అభిమానులు ఎన్టీఆర్ ని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా ఇబ్బంది పెట్టారు. 

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇబ్బంది పడుతూనే వారిని తోసుకుంటూ కారు ఎక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది చూసిన నెటిజెన్స్ ఏమిటండి ఎన్టీఆర్ ఫాన్స్ ఇంత వైలెంట్ గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. 


Jr NTR and Trivikram getting mobbed by fans:

Jr NTR and Trivikram getting mobbed by fans post Tillu Square event.









Source link

Related posts

High Speed Train Between Telugu States Travel distance Decreas Vizag to Hyderabad Travel Within Four hours

Oknews

Arguments are taking place between Telangana Congress and BJP leaders on the issue of a Benz car | Telangana Politics : తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య చిచ్చు పెట్టిన బెంజ్ కారు

Oknews

ఈ వారం సినిమాల సందడి మామూలుగా లేదు!

Oknews

Leave a Comment