Entertainment

kamma rajyam lo kadapa reddlu movie news


కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: పుప్పు సీన్‌తో రచ్చలేపిన వర్మ

దేనికి భయపడని వెనకాడని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ విడుదలయింది. దాదాపు మూడు నిమిషాల ఉన్న ఈ ట్రైలర్ వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలయి ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ వర్మ వాయిస్ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ.. చరిత్రలోనే ఎవరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ ఏపీ రాజకీయ పరిస్థితుల్ని హింసాత్మకంగా చూపించారు డైరెక్టర్ వర్మ.

 ఇక డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్న లోకేష్ బాబు పాత్రధారి ఏడుస్తూ అన్నం తింటూ ఉంటే. చంద్రబాబు పాత్రధారి అక్కడకి వచ్చి పప్పు వడ్డించడాన్ని బట్టి వర్మ లోకేష్‌ని గట్టిగానే టార్గెట్ చేశారు అని అర్థం అవుతుంది. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా ఈ ట్రైలర్‌లో చూపించారు.

Topics:

 



Source link

Related posts

మంటల్లో థియేటర్…ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పని 

Oknews

మహేష్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!

Oknews

ఓ మై గాడ్.. ఈ వారం ఇన్ని సినిమాలా.. సందడే సందడి!

Oknews

Leave a Comment