Sports

Karnataka Cricketer Dies Of Cardiac Arrest While Playing In Cricket Ground


Cricketer Dies Of Cardiac Arrest In the Ground : క్రికెట్‌ మైదానంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటివరకూ మైదానంలో చురుగ్గా కదిలి… బౌలింగ్‌ చేసిన ఓ క్రికెటర్‌ గుండెపోటుతో మరణించడం… క్రికెట్‌ అభిమానులను విషాదంలో ముంచెత్తింది. యువ క్రికెటర్‌ గుండెపోటుకు బలి కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కర్నాటక క్రికెట్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో 34 ఏళ్ల హోయ్‍సల(Hoysala) మృతి చెందాడు. బెంగళూరులోని ఆర్ఎస్ ఐ గ్రౌండ్ లో ఏఈజీ సౌత్ జోన్ టోర్న్ మెంట్ లో తమిళనాడుతో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఊహించని ఘటన జరిగింది. కర్నాటక ప్లేయర్ హోయ్ సల ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతడు గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హోయ్ సల కర్నాటక ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన హోయ్‌సలా అండర్ 25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసర బ్యాటర్‌గా పేరున్న ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌.. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు. 

భోజనానికి వెళ్తుండగా…
మ్యాచ్ అనంతరం హోయ్ సల తన టీమ్ తో కలిసి డిన్నర్ చేసేందుకు వెళ్తున్నాడు. సడెన్ గా గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. వెంటనే సహచరులు అతడికి సీపీఆర్ చేశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతడు చనిపోయాడు. హోయ్ సల అండర్ 25 కేటగిరీలో కర్నాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హోయ్ సల మృతితో జట్టులో తీవ్ర విషాదం అలముకుంది. అతడిక లేడు అనే వార్తను సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోయ్ సల టాలెంటెడ్ ప్లేయర్, మంచి క్రికెటర్ ను కోల్పోయామని సహచరులు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇటీవలే ప్రోక్టర్‌ కన్నుమూత
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ మైక్‌ ప్రోక్టర్‌(Mike Procter) మరణించాడు. డర్బన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన కన్నుమూశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రోక్టర్‌ క్రికెట్‌ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మిడిలార్డర్‌ బ్యాటర్‌గా.. తెలివైన కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా( South African) క్రికెట్‌పై ప్రోక్టర్‌ చెరగని ముద్ర వేశారు. కెప్టెన్‌, కోచ్‌, పరిపాలకుడు, సెలెక్టర్‌, వ్యాఖ్యాత, ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా ప్రోక్టర్‌ బహుముఖ పాత్ర పోషించాడు. గుండెకు శస్త్రచికిత్స తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని పునరాగమనం చేసిన సౌతాఫ్రికా జట్టు తొలి కోచ్‌గా ప్రోక్టర్‌ వ్యవహరించాడు. తన జీవిత చరమాంకంలో పేద పిల్లలకు కోచింగ్‌ ఇస్తూ గడిపాడు. 2008లో సిడ్నీ టెస్టులో జరిగిన మంకీ గేట్‌ వ్యవహారంలో భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌పై మూడు టెస్టుల నిషేధం విధిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకొన్న మ్యాచ్‌ రెఫరీ ప్రోక్టరే.



Source link

Related posts

MI vs DC IPL 2024 Mumbai Indians won by 29 runs

Oknews

PBKS vs SRH IPL 2024 Sunrisers Hyderabad won by 2 runs

Oknews

విడాకుల తర్వాత సానియా మీర్జా మళ్లీ ప్రేమ కోసం చూస్తున్నారా? టెన్నిస్ స్టార్ ఏం చెప్పారంటే..-sania mirza breaks silence on relationship after divorce from shoaib malik ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

Leave a Comment