Kalvakuntla Kavitha Comments: ఎన్నికల వేడి ముగిసిన కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల మధ్య మాటల దాడి ఆగేలా కనిపించడం లేదు. శాసనసభలోనే కాదు..బయట కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కులగణనపై శాసన సభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) విరుచుకుపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఒకే కుటుంబం దగ్గర ఉన్నాయంటుూ రేవంత్ వ్యాఖ్యలు ఆయన సంకుచిత మనస్థత్వానికి నిదర్శనమన్నారు. ఆయన కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పదేపదే కేసీఆర్ పేరు తలచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉండలేకపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
కవిత మాటల దాడి
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ(Telangana) ఏర్పాటు తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉన్నాయని శాసనసభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇకనైనా సంకుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆమె సూచించారు. 2011లో యూపీఏ(UPA) ప్రభుత్వం రూ.4,500 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా కులగణన చేసినా, నివేదిక మాత్రం ఇంకా బయటపెట్టలేదని గుర్తుచేశారు. ఆ వివరాలు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కుటుంబం దాచిపెట్టుకుందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తక్షణం ఆ నివేదికను బయట పెట్టించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆల్రెడీ కులగణన చేపట్టిన తర్వాత కూడా రాహుల్ గాందీ పదేపదే మళ్లీ కులగణన చేపడతామని చెప్పుకోవడం బీసీలను మోసం చేయడమేనన్నారు. ఇంతకు ముందు చేపట్టిన కులగణన నివేదక బయటపెడితే సరిపోతుంది కదా అని కవిత విమర్శాలు. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి బీసీలు గుర్తుకు వస్తారని ఆమె మండిపడింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీ వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసునన్నారు. గతంలో పార్లమెంట్‌లోనే రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీకి బీసీలు ఎప్పుడూ దూరంగానే ఉంటారని కవిత గుర్తుచేశారు. తలా తోకా లేకుండా ప్రవేశపెట్టిన తీర్మానంతో కులగణన ఎలా చేస్తారని నిలదీశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం అసంపూర్తిగా ఉందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
చట్టబద్ధత కల్పించండి
కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలిపారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటితుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎలా చేస్తారో చెప్పకుండా ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టేందుకే తెచ్చారన్నారు. బిహార్(Bihar), కర్ణాటక(Karnataka)లో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారని కవిత గుర్తుచేశారు. అదే విధంగా తెలంగాణలోనూ చట్టం చేసిన తర్వాతే కులగణన చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
మరిన్ని చూడండి