Latest NewsTelangana

KNRUHS Has Released Notification For Admission Into BSc Allied Health Sciences Courses Including Bsc MLT And BPT Courses


తెలంగాణలోని బీఎస్సీ అలైయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీచేయనున్నారు. విద్యార్థులు అక్టోబరు 27 నుంచి నవంబర్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితా విడుదల చేయనున్నారు. 

కోర్సుల వివరాలు..

* బీఎస్సీ అలైడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు

➥ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ

➥ బీఎస్సీ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ 

➥ బీఎస్సీ కార్డియాక్ & కార్డియో వాస్కూలర్ టెక్నాలజీ 

➥ బీఎస్సీ రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ

➥ బీఎస్సీ ఆప్టోమెట్రీ

➥ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ

➥ బీఎస్సీ క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ

➥ బీఎస్సీ రేడియాలజీ

➥ ఇమేజింగ్‌ టెక్నాలజీ

➥ బీఎస్సీ ఆడియోలజీ

➥ స్పీచ్‌ థెరపీ టెక్నాలజీ

➥ బీఎస్సీ మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్‌

➥ బీఎస్సీ న్యూక్లియర్‌ మెడిసిన్‌

➥ బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ 

కోర్సు వ్యవధి: అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎంఎల్‌టీ కోర్సులకు ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి 4 సంవత్సరాలు. బీపీటీ కోర్సులకు 4 సంవత్సరాలు, 6 నెలల ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 

అర్హత: ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 02.01.2007 తర్వాత జన్మించినవారు అనర్హులు.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2,500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2000 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అకడమిక మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా.

సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..

➥ దరఖాస్తు సమయంలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్:  tsparamed2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఫీజు చెల్లింపులో సమస్యలు ఎదురైతే 9121013812 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 

➥ నిబంధనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrparamedadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 

➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

⏩ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 27.10.2023.

⏩ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన‌కు చివరితేది: 27.10.2023.

NOTIFICATION

PROSPECTUS

Website

ALSO READ:

ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్‌) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...



Source link

Related posts

మెగా డాటర్ నీహారిక పై  టిల్లు మావ కామెంట్స్ అదుర్స్ 

Oknews

తాడోపేడో తేల్చుకుంటారా..లేక కాంప్రమైజా

Oknews

ఒక్కరోజే 21 సినిమాలు రిలీజ్‌.. ప్రేక్షకులకు పండగే!

Oknews

Leave a Comment