ByGanesh
Sun 14th Apr 2024 11:33 AM
చాలామంది హీరోయిన్స్ కెరీర్ లో అవకాశాలు తగ్గాయి అంటే కొద్దిరోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కెరీర్ లో అవకాశాలు ఉన్నప్పుడు హై పారితోషికం అందుకున్న హీరోయిన్స్, కెరీర్ డౌన్ అవ్వగానే పారితోషికం తగ్గించేసుకోవడానికి రెడీ అవుతారు. అందులో ఇప్పుడు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చేరింది అనే న్యూస్ నడుస్తుంది. ఉప్పెన చిత్రానికి లక్షల్లో పారితోషికం అందుకున్న కృతి శెట్టి తర్వాత కోటిపైనే అందుకుంది.
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు వరసగా హిట్ అవడంతో కృతి శెట్టి క్రేజ్, ఆమె పారితోషికం రెండు పెరిగాయి. ఉప్పెన చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో ఐదారుగురు యంగ్ హీరోలు కృతి శెట్టికి అవకాశాలు ఇచ్చారు. మొదటి మూడు సినిమాలు హిట్ అయినా తర్వాత నాలుగు సినిమాలు వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ నిరాశపరచడంతో కృతి శెట్టి ని టాలీవుడ్ పట్టించుకోవడం మానేసింది.
చాలా గ్యాప్ తో తెలుగులో శర్వానంద్ తో మనమే చిత్రంతో పాటుగా తమిళనాట, మలయాళంలోనూ కాస్త బిజీగా మారిన కృతి శెట్టి ఇప్పుడు తన పారితోషికాన్ని తగ్గించేసింది అనే టాక్ మొదలయ్యింది. కోట్లు ఉన్న పారితోషికాన్ని సగం తగ్గించింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అటు ట్రెడిషనల్ నుంచి గ్లామర్ గా టర్న్ అయినా కృతి శెట్టిని పట్టించుకోకపోవడంతోనే ఆమె ఇలా పారితోషికాన్ని తగ్గించేసింది అంటుంటే.. పారితోషికం తగ్గిస్తే అని జరుగుద్దా అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
Krithi Shetty reduces her remuneration:
Krithi Shetty Reduces Her Remuneration