<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని మిలీనియం స్కూల్ విద్యార్థులు కొందరు ఓ చిన్న వీడియో తయారుచేసి, తమ వార్షికోత్సవ కార్యక్రమానికి రావాలని కేటీఆర్ కు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్… తాను అందుకున్న క్యూటెస్ట్ ఇన్విటేషన్ ఇదేనని, వేరే ప్లాన్స్ ఉన్నా సరే మనసు మార్చుకున్నానని, కచ్చితంగా వస్తానని ట్వీట్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ స్కూల్ వార్షికోత్సవానికి హాజరై పిల్లలతో సరదాగా గడిపారు.</p>
Source link
previous post