Sports

Ktr Special Tweet On Shamar Joseph After Is Stunning Performance Against Australia Ktr


KTR Special Tweet On Shamar Joseph: షమార్‌ జోసెఫ్‌(Shamar Joseph)… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఈ విండీస్‌ సీమర్‌ నిప్పులు చెరిగే బంతులకు బౌలింగ్ దిగ్గజాలు సైతం సలాం చేస్తున్నారు. కంగారులను వారి గడ్డపైనే గడగడలాడించి.. విండీస్‌కు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత చారిత్రక విజయాన్ని అందించాడు. గబ్బాలో అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రకు నాంది పలికాడు. రెండో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి, 8 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించాడు. ఈ వెస్టిండీస్‌ నయా సంచలనంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR)ప్రశంసలు కురిపించారు. షమర్‌ జోసెఫ్‌ ఎంత అద్భుతమైన కథ నీది… ఈ నయా సంచలనం కోసం క్రికెట్‌ ప్రపంచం, బ్యాటర్లందరూ సిద్ధమై ఉండాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. గబ్బాలో ఆసీస్‌ను ఓడించిన విండీస్‌ మ్యాచ్‌ హైలెట్స్‌ చూశానని… ఫాస్ట్‌బౌలర్లు ఈ ప్రదర్శన చూసేందుకు ఆసక్తి కనబరుస్తారని ట్వీట్‌ చేశారు.

నేపథ్యం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే…
గయానా దీవుల్లోని ఫోన్లు, ఇంటర్నెట్‌లు లేని ఓ పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టాడు షమార్‌. ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్లాలంటే పడవలే దిక్కు. తొలుత కట్టెలు కొట్టే పని చేసే షమార్‌… తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం పట్టణానికి వలస వెళ్లి ఓ నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా మారాడు. ఆ తర్వాత అతను సెక్యూరిటీ గార్డుగానూ పని చేశాడు. రెండేళ్ల ముందు వరకు అతను అదే పనిలోనే ఉన్నాడు. వెస్టిండీస్‌ జాతీయ జట్టుకు ఆడిన రొమారియో షెఫర్డ్‌తో ఉన్న పరిచయం వల్ల అతను గయానా జట్టు కోచ్‌ దృష్టిలో పడ్డాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే సెలక్షన్‌ ట్రయల్స్‌కు వెళ్లాడు. అక్కడ ప్రతిభ చాటుకుని డివిజన్‌-1 క్రికెట్లో అవకాశం సంపాదించాడు. అక్కడ తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీశాడు. తర్వాత కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో నెట్‌బౌలర్‌గా ఛాన్స్‌ దక్కింది. అదే సమయంలో దిగ్గజ బౌలర్‌ ఆంబ్రోస్‌.. అతడి బౌలింగ్‌ చూసి మెచ్చుకున్నాడు. ఇంకో ఏడాదిలో నిన్ను గయానా జట్టులో చూడాలనుకుంటున్నానని  అన్నాడు. ఆంబ్రోస్‌ చెప్పిన గడువులోపే షమార్‌.. 2023 ఫిబ్రవరిలో గయానా తరఫున ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం అందుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో, అలాగే గత ఏడాది కరీబియన్‌ లీగ్‌లో నిలకడగా రాణించడంతో ఇటీవలే వెస్టిండీస్‌ జాతీయ జట్టులోకి ఎంపికైన షమార్‌.. ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి సిరీస్‌లోనే సంచలన ప్రదర్శన చేసి హీరోగా మారాడు.

లీగ్‌లవైపు షమార్‌ చూపు..
ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శనతో షమార్‌ వైపు టీ20 లీగులు అన్నీ అతడి కోసం పరుగులు పెడుతున్నాయి. గబ్బా మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League) లో ఆడటానికి సంతకం చేశాడు జోసెఫ్. షమార్ ఈ లీగ్ లో పెషావర్ జల్మీ జట్టుకు ఆడటానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఒకే ఒక్క మ్యాచ్ తో తన జీవితాన్నే మార్చుకున్నాడు షమర్ జోసెఫ్. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. ఐపీఎల్ తో పాటు మరి లీగుల్లో అతడు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సెక్యూరిటీ గార్డు నుంచి స్టార్ క్రికెటర్ గా తన జీవితాన్ని మార్చుకున్నాడు షమర్ జోసెఫ్.

మరిన్ని చూడండి



Source link

Related posts

World Cup 2023 New Zealand Vs Netherlands LIVE Streaming Info, When And Where To Watch NZ Vs NED Match Today?

Oknews

Ind vs Eng 5th Test Highlights: ఇన్నింగ్స్ ఓటమితో పరాభవాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్ జట్టు

Oknews

IPL 2024 Ishan Kishan Makes Only 19 On Return To Competitive Cricket

Oknews

Leave a Comment