Latest NewsTelangana

last date to apply online for TSPSC Group 1 is 14th March apply immediately


TSPSC Group1 Application: తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభంకాగా.. మార్చి 14తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 2.7 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు మార్చి 14న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే గతంలో టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ (Notification No. 04/2022 Dt. 26/04/2022) సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరంలేదు.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.320 చెల్లించాలి. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి, ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మే/జూన్ నెలల్లో ప్రిలిమ్స్(ఆబ్జెక్టివ్) పరీక్ష, సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో మెయిన్ (కన్వెన్షనల్) పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి 4 గంటల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

గ్రూప్-1 పోస్టుల వివరాలు..























క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..









ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 23.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 14.03.2024. (5:00 PM)
దరఖాస్తుల సవరణకు అవకాశం 23.03.2024 (10:00 A.M.) – 27.03.2024 (5:00 P.M.)
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు పరీక్షకు వారం ముందు నుంచి అందుబాటులో
ప్రిలిమినరీ పరీక్ష మే/జూన్ 2024.
మెయిన్ పరీక్ష సెప్టెంబరు/అక్టోబరు 2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

rbi said 2000 rupees notes worth 8897 crores are still in the market know details | Rs 2000 Notes: ఇంకా జనం చేతుల్లోనే రూ.8,897 కోట్లు

Oknews

YCP happy with Janasena decision జనసేన డెసిషన్ తో వైసీపి హ్యాపీ

Oknews

అంబానీ నిర్మాతగా తెరకెక్కిన సంపూర్ణేష్ బాబు సినిమా హిట్ టాక్  

Oknews

Leave a Comment