ByGanesh
Fri 12th Apr 2024 03:53 PM
మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మంజుమెల్ బాయ్స్ ని పలు భాషల వారు డబ్బింగ్ చేసి విడుదల చేసారు. తెలుగు, తమిళ కన్నడ భాషల్లో మంజుమెల్ బాయ్స్ డబ్బింగ్ మూవీ మూవీగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మంజుమెల్ బాయ్స్ దాదాపుగా 200 కోట్లు రాబట్టింది. మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మంజుమెల్ బాయ్స్ మిగతా భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.
ఏప్రిల్ 6న విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులో కూడా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. అయితే మలయాళ నిర్మాతలకి PVR సంస్థకు వచ్చిన విభేదాల వలన PVR మల్టిప్లెక్స్ మంజుమెల్ బాయ్స్ ని తెలుగు థియేటర్స్ లో ప్రదర్శన ఆపేసింది. ఈలోపు ఇప్పుడు మంజుమెల్ బాయ్స్ ఓటీటీ డేట్ లాక్ అయినట్లుగా తెలుస్తుంది.
ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 6 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని మే 3వ తేదీ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అదే మే 3న మలయాళం, తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లోనూ ఈచిత్రాన్ని ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నారని టాక్.
Latest Blockbuster Locks OTT Date:
Manjummel Boys Locks OTT Streaming Date