GossipsLatest News

Leaving Skanda.. Ram in smart sets స్కంద వదిలేసి.. ఇస్మార్ట్ సెట్స్ లో రామ్



Fri 22nd Sep 2023 11:01 AM

skanda  స్కంద వదిలేసి.. ఇస్మార్ట్ సెట్స్ లో రామ్


Leaving Skanda.. Ram in smart sets స్కంద వదిలేసి.. ఇస్మార్ట్ సెట్స్ లో రామ్

స్కంద విడుదలకు ఆరు రోజుల సమయమే ఉంది. అది మేకర్స్ కూడా పోస్టర్స్ తో రోజూ గుర్తు చేస్తున్నారు. అయితే రామ్ కానీ, బోయపాటి కానీ ఇప్పటివరకు స్కంద ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదు. విడుదలకు వారం కూడా సమయం లేని స్కంద ప్రమోషన్స్ వదిలేసి రామ్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడనే న్యూస్ చూసాక.. ఏంటి రామ్ స్కందని వదిలేసావ్, ప్రమోషన్స్ పట్టవా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

స్కంద ప్రమోషన్స్ విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాక రామ్ అభిమానులు తల పట్టుకుంటున్నారు. కానీ రామ్ కూల్ గా డబుల్ ఇస్మార్ట్ సెట్స్ లో కావ్యా థాపర్ తో పాటేసుకుంటున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం రామ్-కావ్యా థాపర్ ల మీద ఓ పాట చిత్రీకరణ పూర్తయ్యింది అనే న్యూస్ చూసాక నెటిజెన్స్ షాకవుతున్నారు. 

బోయపాటి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటే.. రామ్ తన హీరోయిన్ శ్రీలీల ని తీసుకుని స్కంద ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సింది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పడం కానీ దానికి అనుగుణంగా ప్రమోషన్స్ చెయ్యాలి. ఇదేంటి రామ్.. హీరోగా ఎన్నో సక్సెస్ లు చూసావు.. నీకు ఈమాత్రం తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Leaving Skanda.. Ram in smart sets:

Skanda release on Sep 28th









Source link

Related posts

MP Raghurama Actor Ram charan wishing BRS MP Vaddiraju Ravichandra

Oknews

అక్కడ తేల్చడం – ఇక్కడ చీల్చడం..!!

Oknews

Establishment Of Sainik School In Secunderabad Cantonment Area

Oknews

Leave a Comment