Health Care

Long Living Animals : మనుషులకంటే ఎక్కువకాలం జీవించే జంతువులు.. ఎలా సాధ్యం?


దిశ, ఫీచర్స్ : మానవుల ఆయుష్షు వందేండ్లు అని చెప్తుంటారు. ఒకప్పుడు చాలామంది 90 నుంచి వందేండ్లు బతికేవారు. కానీ ఈరోజుల్లో అలాంటి గ్యారెంటీ లేకుండా పోయింది. ప్రస్తుతం 70 ఏండ్లు జీవించడమంటే మహా గొప్ప అని నిపుణులే అంటున్నారు. ఆధునికత పెరిగినా, మానవుడు ప్రకృతిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్నప్పటికీ, నూరేండ్లకు పైగా బతకాలని, కాలాన్ని జయించాలనే ఆశలు అడియాశలుగానే మిగులుతున్నాయి. కానీ కొన్ని జంతువులు మాత్రం ఆయుఃప్రమాణంలో మానవుల్ని దాటేశాయి. అలాంటి యానిమల్స్ ఏవో చూద్దాం.

బోహెడ్ తిమింగలం, కోయి చేపలు

ఎక్కువ కాలం జీవించగలిగే సముద్రపు జీవుల్లో బోహెడ్ తిమింగలాలు ఒకటి. ఇవి రెండు వందల ఏండ్లకంటే ఎక్కువగా జీవిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చల్లగా ఉంటే ఆర్కిటిక్ సముద్రంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటి శారీరక పెరుగుదల కూడా స్లోగా ఉంటుంది. కాగా శరీర నిర్మాణ ప్రక్రియలోనే ఎక్కువకాలం జీవించగలిగే లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే జపాన్ దేశంలోని జలవనరుల్లో ఎక్కువగా కనిపించే కోయి చేపలు సుమారు 70 నుంచి 120 ఏండ్లు బతికేస్తాయి.

గ్రీన్‌ లాండ్ షార్క్, గాలాపాగోస్ తాబేళ్లు

కొన్ని గ్రీన్ లాండ్ షార్క్‌లు కూడా 350 నుంచి 400 ఏండ్ల వరకు బతుకుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. వీటి ఎదుగుదల కూడా చాలా స్లోగా ఉంటుంది. పైగా ఇవి చాలా తక్కువ ఆహారాన్ని తిని బతుకుతుంటాయి. అలాగే గాలాపాగోస్ దీవుల్లో నివసించే తాబేళ్లు కూడా వందేండ్ల నుంచి 150 ఏండ్ల వరకు బతికినట్లు నిపుణులు చెప్తున్నారు. అట్లనే సముద్రపు అంచుల గుండా తిరుగాడుతూ కనిపించే రెడ్ సీ అర్చిన్స్ 200 ఏండ్లకంటే ఎక్కువకాలం జీవిస్తాయి. సౌత్ అండ్ మిడిల్ అమెరికా దేశాల్లో కనిపించే మకావ్ బర్డ్స్ కూడా 80 నుంచి వందేండ్లు బతుకుతాయి. ఇవి చూడ్డానికి చాలా అందంగా, కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి.



Source link

Related posts

పంచ గ్రహ కూటమి.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

Oknews

అది కూడా డయాబెటీస్ రావడానికి ఓ కారణమట.. తాజా పరిశోధనలో నమ్మలేని నిజాలు

Oknews

సక్సెస్ కావాలంటే.. ఆ ఒక్కటి మీలో ఉండకూడదు!

Oknews

Leave a Comment