Sports

LSG vs DC IPL 2024 Head to Head records


LSG vs DC IPL 2024 Head to Head records : ఈ ఐపీఎల్‌(IPL)లో నాలుగు మ్యాచులు అడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో తలపడనుంది.  వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి మండి ఊపుమీదున్న లక్నో… ఢిల్లీపైనా గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఢిల్లీ అయిదు మ్యాచుల్లో కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ… తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో సూపర్‌ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌
ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడుసార్లు తలపడ్డాయి.  ఈ మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 2023 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో కైల్ మేయర్స్ 38 బంతుల్లో 73 పరుగులు చేయడంతో 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఢిల్లీని కేవలం 143 పరుగులకే పరిమితం చేసి ఘన విజయం సాధించింది. 

పిచ్‌ రిపోర్ట్‌
లక్నోలోని ఎకానా స్టేడియం బ్యాటర్‌.. బౌలర్లకు సమానంగా అనుకూలిస్తోంది. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో లక్నో తొలుత 199 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో లక్నోను గుజరాత్ టైటాన్స్ 163 పరుగులకే పరిమితం చేసింది. దీనిని  బట్టి పిచ్‌ బ్యాటర్లకు, బౌలర్లకు అనుకూలిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు. నెమ్మదిగా ఉండే ఈ పిచ్ స్పిన్నర్లకు ఉపకరిస్తుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన తొమ్మిది మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరుసార్లు విజయం సాధించింది. రెండుసార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం 159. అత్యధిక స్కోరు 199/8. అత్యల్ప జట్టు మొత్తం 108. 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: 
రిషబ్ పంత్ ( కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్. 

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్ అర్షద్ ఖాన్.

మరిన్ని చూడండి



Source link

Related posts

PKL Season 10 Prize Money: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌ ప్రైజ్ మనీ వివరాలు ఇవే.. విజేతకు ఎంతంటే?

Oknews

Ashwin And Bairstow Set To Play Their 100th Test In Dharamshala

Oknews

SRH vs MI IPL 2024 Sunrisers Hyderabad vs Mumbai Indians Match Preview

Oknews

Leave a Comment