Sports

LSG vs GT IPL 2024 gujarat target 164


LSG vs GT IPL 2024 gujarat target 164:  ఐపీఎల్‌- సీజన్‌ 17 లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన   లఖ్‌నవూ  జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది  స్టాయినిస్‌  అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ రాహుల్‌  33 పరుగులు , బదోని 20 పరుగులు చేయగా,  పూరన్‌ 32 పరుగులతో  రాణించారు. ఈ మ్యాచ్ లో  డికాక్‌, పడిక్కల్‌ లు  నిరాశపరిచారు. గుజరాత్‌ బౌలర్లలో దర్శన్‌, ఉమేశ్‌ చెరో 2 వికెట్లు తీయగా.. జాన్సన్‌ ఒక వికెట్‌  పడగొట్టి GTని కేవలం 163 పరుగులకే పరిమితం చేశారు.   KL   స్టోయినిస్ 73 పరుగుల భాగస్వామ్యాన్ని ఇచ్చారు. 

టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నోబ్యాటర్లు  మంచిగా రాణించలేకపోయారు.   హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని  ఉపయోగించుకోలేకపోయారు.  ఎడాపెడా కొట్టడం మానేసి క్రీజ్లో ఉండటమే అవసరం అన్నట్టుగా ఆడిన మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్31 బంతుల్లో 3 ఫోర్లుతో 33 పరుగులు చేశాడు. మొత్తానికి   నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్లు  నష్టానికి 163 పరుగులు చేసింది.  టాస్ గెలిచిబరిలో కు దిగిన‌ లక్నో కు ప్రారంభం లోనే షాక్ త‌గిలింది. టైటాన్స్ పేస‌ర్ ఉమేశ్ యాద‌వ్ విజృంభ‌ణ‌తో రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. తొలి ఓవ‌ర్లోనే   డేంజ‌ర‌స్ ఓపెన‌ర్గా పేరున్న  క్వింట‌న్ డికాక్  ఆరుపరుగులకే  ఔట‌య్యాడు. తరువాత సేప‌టికే దేవ్‌ద‌త్ ప‌డిక్కల్‌ 7 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.   ఈ  దెబ్బతో ల‌క్నో 18 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్‌, మార్కస్ స్టోయినిస్‌ లు ఆచితూచి ఆడారు.  చివరలో నికోలస్ పూరన్ఆ యుష్ బదోని కు కాస్త  రాణించడంతో లక్నో 163 పరుగులు చేసింది. 

గుజరాత్ ఏం చేయనుందో.. 

కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్‌కు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రెండు మ్యాచులు గెలిచి రెండు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో 48 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేసిన గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. అదే ఫామ్‌ కొనసాగించాలని  గిల్‌ చూస్తున్నాడు. సాయి సుదర్శన్ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే భారీ స్కోర్లు నమోదు చేయాలని సుదర్శన్‌  ప్లాన్ వేశాడు . అలాగే  గుజరాత్‌ టైటాన్స్‌ లో వృద్ధిమాన్ సాహాకు బదులుగా బి ఆర్ శరత్   తొలిసారి బరిలో దిగనున్నాడు.

భారమంతా మాయంక్‌పైనే 

టార్గెట్ తక్కువగానే ఇవ్వడంతో ఇప్పుడంతా భారమంతా బౌలర్లపైనే పడింది.  పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల మాయంక్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను తన పేస్‌తో ఆశ్చర్యపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3/14 గణాంకాలతో ఆర్సీబీ ఓటమికి ప్రధామ కారణమయ్యాడు. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను 151 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఆశ్చర్యపరిచాడు.

 ఇప్పటివరకు లక్నో చేతిలో ఓటమి లేని గుజరాత్  
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్‌తో గుజరాత్‌ నాలుగుసార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గుజరాత్ టైటాన్స్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకూ ఓడిపోలేదు. 2022 ఛాంపియన్‌ అయిన గుజరాత్‌… లక్నోతో మొత్తం నాలుగు సార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గురజాత్‌ గెలిచింది.

మరిన్ని చూడండి



Source link

Related posts

WPL 2024 Final RCB vs DC: స్మృతి మంధాన సేన ఆర్సీబీకి తొలి టైటిల్ సాధిస్తుందా..?

Oknews

Pakistan Cricket : పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అసాధారణ ప్రకటన, నివ్వెరపోయిన క్రికెట్‌ ప్రపంచం

Oknews

పసుపుకొమ్ముపై మినీ వరల్డ్ కప్

Oknews

Leave a Comment