LSG vs GT IPL 2024 Lucknow Super Giants won by 33 runs: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది. లక్ష్యఛేదనలో గుజరాత్ మొత్తం వికెట్లు కోల్పోయి 130 పరుగులకే కుప్పకూలింది.
స్వల్ప ఛేదనలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కష్టాల్లో పడింది. రెండు పరుగుల వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కేన్ విలియమ్సన్(1) వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. కుడివైపు ఎగిరి మరీ బిష్ణోయ్ ఆ బంతిని అందుకున్నాడు. దాంతో, 56 పరుగులకే రెండో వికెట్ పడింది. అంతకుమందు యవ్ ఠాకూర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్(19) ఔటయ్యాడు. ఠాకూర్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి బౌల్డయ్యాడు. దాంతో, 54 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 54/1. కృనాల్ పాండ్య కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తరువాత కృనాల్ పాండ్య వేసిన 13 ఓవర్‌లో తొలి బంతికి దర్శన్ నల్కండే దొరికిపోయాడు. తరువాత నుంచి గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. గుజరాత్ జట్టులో ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు.న్ దీంతో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది.
అలా మొదలయ్యింది..
ఐపీఎల్- సీజన్ 17 లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన లఖ్‌నవూ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేకపోయారు. స్టాయినిస్ ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రాహుల్ 33 పరుగులు , బదోని 20 పరుగులు చేయగా, పూరన్ 32 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్ లో డికాక్, పడిక్కల్ లు నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో దర్శన్, ఉమేశ్ చెరో 2 వికెట్లు తీయగా.. జాన్సన్ ఒక వికెట్ పడగొట్టి GTని కేవలం 163 పరుగులకే పరిమితం చేశారు.
హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకోలేకపోయారు. ఎడాపెడా కొట్టడం మానేసి క్రీజ్లో ఉండటమే అవసరం అన్నట్టుగా ఆడిన మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్31 బంతుల్లో 3 ఫోర్లుతో 33 పరుగులు చేశాడు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్లు నష్టానికి 163 పరుగులు చేసింది. టాస్ గెలిచిబరిలో కు దిగిన లక్నో కు ప్రారంభం లోనే షాక్ తగిలింది. టైటాన్స్ పేసర్ ఉమేశ్ యాదవ్ విజృంభణతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్గా పేరున్న క్వింటన్ డికాక్ ఆరుపరుగులకే ఔటయ్యాడు. తరువాత సేపటికే దేవ్‌దత్ పడిక్కల్ 7 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. ఈ దెబ్బతో లక్నో 18 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ లు ఆచితూచి ఆడారు. చివరలో నికోలస్ పూరన్ఆ యుష్ బదోని కు కాస్త రాణించడంతో లక్నో 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయారు. కానీ బౌలింగ్‌లో అదరగొట్టి గుజరాత్ టాప్‌గన్స్‌ను 130కే కట్టడి చేసింది.
మరిన్ని చూడండి