Sports

Lucknow vs Punjab IPL 2024 LSG won by 21 runs


Lucknow vs Punjab IPL 2024  LSG won by 21 runs: ఐపీఎల్‌-17లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199… పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటాన్‌ డికాక్‌ 54, నికోలస్‌ పూరన్‌ 42, కృనాల్‌ పాండ్య 43 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్ 3, అర్ష్‌దీప్‌ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్… ఒక్కో వికెట్ పడగొట్టారు. అనతంరం భారీ లక్ష్య ఛేధనలో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. పంజాబ్‌ బ్యాటర్లలో శిఖర్‌ ధావన్‌ 70, బెయిర్‌ స్టో 42 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో పంజాబ్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. లఖ్‌నవూ బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 3, మోసిన్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టారు. 

మ్యాచ్ ఎలా జరిగిందంటే.. 

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ భారీ స్కోరుచేసింది. .నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌, నికోలస్‌ పూరన్‌ చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగారు. చివర్లో కృనాల్ పాండ్యా ధాటిగా  ఆడాడు. మొత్తానికి  పంజాబ్‌ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ప్రారంభంలోనే షాక్‌ తగిలింది. పవర్‌ ప్లే ముగిసేలోపే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్ ( 9 బంతుల్లో 15 పరుగులు)‌, ఆరో ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ ( 6 బంతుల్లో 9 పరుగులు ) ఔటయ్యారు. రబాడ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికి రాహుల్ భారీ షాట్ ఆడగా.. హర్షల్ పటేల్ క్యాచ్‌ మిస్‌ చేశాడు.  దీంతో కాస్తలో బతికిపోయిన రాహుల్ తరువాత నాలుగో ఓవర్లో తప్పించుకోలేక పోయాడు. 
తర్వాత క్వింటన్ డికాక్‌ వరుసగా ఫోర్, సిక్స్‌ బాదాడు. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టాయినిస్‌  కూడా పెద్దగా  రాణించలేకపోయాడు. తర్వాత వచ్చిన నికోలస్‌ పూరన్‌  ఓపెనర్‌ డికాక్‌  కు మంచి పార్టనర్‌షిప్‌ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ అందించారు.   హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌ను అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు.  13వ ఓవర్‌లో డికాక్‌ ఔటయిన తర్వాత పూరన్‌ జోరుకు బ్రేక్‌ పడింది. డికాక్‌, పూరన్‌ పరుగుల వేటను కృనాల్‌ పాండ్యా కొనసాగించాడు. ఈ దశలో కృనాల్ పాండ్య కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి లక్నో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ అప్పటికే పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో 19 ఓవర్‌లో లఖ్‌నవూ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది.  మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్ లో సామ్ కరన్ 3 వికెట్లతో చెలరేగాడు. అర్ష్దీప్సింగ్ కు రెండు వికెట్లు దక్కాయి. రబాడా, రాహుల్ చాహర్ తలో వికెట్ సంపాదించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

A rare milestone unlocked for Virat Kohli as he reaches to 100th half century in T20 Cricket

Oknews

Carrey and Cummins carry Australia past New Zealand in thrilling finish

Oknews

IPL 2024 RCB vs KKR Virat Kohli Gautam Gambhir Hug Moment in Time Out Moment of the Day Pics Viral

Oknews

Leave a Comment