ByMohan
Sat 20th Jan 2024 06:33 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన గుంటూరు కారం సినిమాపై మొదటి రోజు ఎటువంటి నెగిటివ్ ప్రచారం జరిగిందో తెలియంది కాదు. కొందరు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో పోల్చుతూ.. రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయినా కూడా సినిమా కలెక్షన్ల విషయంలో ఎక్కడా డ్రాప్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టి.. బ్రేకీవెన్‌కి చేరువలో ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత నాగవంశీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సినిమా సక్సెస్‌పై మహేష్ బాబు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా ఆయన తెలిపారు.
మహేష్ గారు ఈ సినిమా మొదలైనప్పటి నుండి సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలైన రోజు నెగిటివ్ రివ్యూలు, కొందరు కావాలని నెగిటివ్ ప్రచారం చేసినా.. ఆయన ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇంకా ఆయనే మాకు ధైర్యం చెప్పారు. రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో మీరే చూడండి అంటూ మాకు కూడా భరోసా ఇచ్చారు. మహేష్‌గారి అంచనానే నిజమైంది. ఆయన ధైర్యం, నమ్మకమే గుంటూరు కారం సినిమా ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైందని మేము కూడా నమ్ముతున్నాం.. అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
మేము కూడా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియెన్స్‌కి చేరువ చేయలేకపోయాం. ప్రచారలోపం మాలోనూ ఉంది. ఇది మాస్ సినిమా అని అందరూ భావించారు. త్రివిక్రమ్‌గారి శైలిలో ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులకు తెలిసేలా చేసి ఉండాల్సింది. అయినా జానర్‌ను బట్టి ఒక్కో సినిమా ఒక్కో ఏరియాలో ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. కేవలం ఒక ప్రాంతం వసూళ్లను చూసి సినిమా ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తారు? సినిమా విజయం అనేది ఫుల్ రన్ వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు గుంటూరు కారం మొదటి వారంలోనే రూ. 212 కోట్లను రాబట్టింది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతుంది. ఫైనల్‌గా మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా గుంటూరు కారం నిలుస్తుంది.. అని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
Mahesh Babu Response on Guntur Kaaram Result:
Producer Naga Vamsi About Guntur Kaaram Collections