ByGanesh
Thu 22nd Feb 2024 04:38 PM
మహేష్ బాబు ఫ్యామిలీతో ఎక్కువగా వెకేషన్స్ కి వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, అలాగే ఆయన సినిమా ఈవెంట్స్ లోను, సెలబ్రిటీస్ ఫంక్షన్స్ లోను, ఇంకా తాను బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న ఈవెంట్ ప్రమోషన్స్ లో తరుచూ కనిపిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు కొద్దిరోజుల పాటు మీడియాకి దూరంగా మాయమైపోతారనే మాట వినిపిస్తోంది. కారణం మహెష్ బాబు రాజమౌళి సినిమా SSMB29 కోసం ఫుల్ గా మేకోవర్ అవుతున్నారు. ఇప్పటికే లుక్ కి సంబంధించి కొన్ని సలహాల కోసం ఆయన జర్మనీ వెళ్ళొచ్చారనే టాక్ ఉంది.
కొద్దిరోజుల్లో మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం లుక్ టెస్ట్ లో పాల్గొంటారట. ఇప్పటికే మహేష్ బాబు ఫిట్నెస్, స్టైలింగ్ పై శ్రద్ధ పెట్టారు. ప్రెజెంట్ మహేష్ బాబు ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచుతున్నారు. ఒక్కసారి లుక్ టెస్ట్ అయ్యాక మహేష్ మీడియాకి కొద్దిరోజుల పాటు కనిపించరని తెలుస్తుంది. మరి ఆయన ఇతర డైరెక్టర్స్ తో సినిమాలు చేసినప్పుడు మధ్యలో వెకేషన్స్ కి అలాగే కొన్ని ప్రొడక్ట్స్ కోసం యాడ్ షూటింగ్స్ కి వెళుతూ ఉంటారు. రాజమౌళి తో సెట్స్ లోకి వెళ్ళాక ఇవి సాధ్యమవుతాయా అని మహేష్ అభిమానులు అనుమాన పడుతున్నారు.
ఏది ఏమైనా మహేష్ మాత్రం కొద్దిరోజుల పాటు మీడియా ముందుకు రారు అని తెలుస్తుంది.
Mahesh is disappearing:
Mahesh Babu will not come before the media for a few days