GossipsLatest News

Maruthi Talks about Prabhas Raja Deluxe Movie ప్రభాస్.. అప్పటివరకు అప్‌డేట్ లేనట్లేనా?



Sun 08th Oct 2023 07:24 AM

prabhas,maruthi,raja deluxe,no update  ప్రభాస్.. అప్పటివరకు అప్‌డేట్ లేనట్లేనా?


Maruthi Talks about Prabhas Raja Deluxe Movie ప్రభాస్.. అప్పటివరకు అప్‌డేట్ లేనట్లేనా?

ప్రభాస్-మారుతి కలయికలో ఓ సినిమా సైలెంట్‌గా తెరకెక్కుతుంది. ఆ సినిమా అప్‌డేట్ ఇంతవరకు అధికారికంగా బయటికి రాలేదు. మారుతి కూడా సైలెంట్‌గా లీకులిస్తూ ప్రభాస్ లుక్‌ని చూపించేశాడు. అది కూడా లీకుల రూపంలోనే ప్రభాస్ ఫాన్స్‌కి అందించాడు. మరోపక్క ప్రభాస్ ఫాన్స్ నెగిటివిటీని తట్టుకోలేక మారుతి ప్రభాస్ మూవీ అప్‌డేట్ ఇవ్వడం లేదనే టాక్ ఉంది. 

తాజాగా.. అసలు ప్రభాస్‌తో తెరకెక్కించే సినిమా అప్‌డేట్ ఎందుకివ్వలేదో మారుతి తన బర్త్ డే స్పెషల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో ప్యాన్ ఇండియా మూవీస్ చాలా ఉన్నాయి. వీటి మధ్యలో తన సినిమా అప్‌డేట్ ఇస్తే.. అది ఎవరికీ కనిపించదని మారుతి అంటున్నారు. ముందుగా ఆయన నటిస్తున్న సలార్ విడుదల కాబోతుంది. ఆ తర్వాత కల్కి వస్తుంది. ఇన్ని అప్‌డేట్స్ మధ్యన నా సినిమా అప్‌డేట్ వస్తే అభిమానులు గందరగోళపడిపోతారు. అందుకే ఆ సినిమాలు విడుదలయ్యే వరకు ప్రభాస్ సినిమా అప్‌డేట్ ఇవ్వడం లేదు, ప్రభాస్ సినిమా అప్‌డేట్ ఎప్పుడు ఇవ్వాలో టీం చూసుకుంటుంది అంటూ మారుతి చెప్పుకొచ్చాడు. 

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాజా డీలక్స్ అన్న టైటిల్‌తో మొదలైన ఈ చిత్రానికి మూడు టైటిల్స్ అనుకుంటున్నట్లుగా.. ఏదో ఒకటి ఫైనల్ చేస్తామని మారుతి బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈచిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిది కుమార్, నిధి అగర్వాల్ కనిపించబోతున్నారు.


Maruthi Talks about Prabhas Raja Deluxe Movie:

3 Titles Selected for Prabhas and Maruthi Combo Film









Source link

Related posts

Venky Saindhav OTT Streaming Date Out 2 కాదు..సైంధవ్ ఓటీటీలో ఎప్పుడంటే

Oknews

Telangana News: బీఆర్ఎస్‌కు మరో దెబ్బ తప్పదా? కారు దిగడానికి మాజీ ఎంపీ రెడీ?

Oknews

Revanth Reddy satires in BRS leader KTR in Telangana Assembly | Revanth Reddy: బీఆర్ఎస్‌లో ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఈ మధ్య ఆటోలెక్కి డ్రామాలు

Oknews

Leave a Comment