Sports

Mayank Agarwal Admitted In Hospital Due To Sick During Flight


Mayank Agarwal Health  Hospitalized: టీమిండియా (Team India) క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌(Mayank Agarwal) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) లో కర్నాటకకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌ .. అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడ్డాడు. అగర్తలాలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన అనంతరం కర్నాటక జట్టు సూరత్‌కు ప్రయాణమైంది. విమానంలో కర్నాటక జట్టుతో ఉన్న అగర్వాల్‌.. నోటి, గొంతులో మంటతో ఇబ్బందిపడ్డాడు. మయాంక్.. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్‌ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అగర్వాల్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని కర్నాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది.

విమానంలోనే…
కలుషిత నీటిని తాగడం వల్లే మయాంక్‌ అగర్వాల్‌ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కర్నాటక గోవాతో పాటు త్రిపురపైనా గెలిచింది. ‘త్రిపురతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత కర్నాటక జట్టు సూరత్‌కు ప్రయాణమైంది. ఇదే సమయంలో వాంతులతో ఇబ్బందిపడ్డ అగర్వాల్‌ తనకు గొంతులో మంటగా ఉందని చెప్పాడు. కర్నాటక టీమ్‌ అధికారులు మాకు ఈ విషయం చెప్పడంతోనే వెంటనే విమానం నుంచి కిందకు దించి అగర్తలాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం అగర్వాల్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు..’ అని త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌(Tripura Cricket association) ప్రతినిధి తెలిపారు. మయాంక్‌  అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.  విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం మయాంక్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్  తెలిపారు.

రంజీల్లో హైద్రాబాద్‌ జైత్రయాత్ర
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్లేట్‌ గ్రూప్‌లో ఇప్పటికే వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన హైద్రాబాద్‌ జట్టు… తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్‌ 187 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ విజయాలు సాధించిన హైద్రాబాద్‌.. నాలుగో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్‌ విజయం సాధించి సత్తా చాటింది. ప్లేట్‌ గ్రూప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్న హైదరాబాద్‌.. తాజాగా ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ ట్రిపుల్‌ సెంచరీ బాదడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్‌ 187 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ రెండు రోజుల్లోనే ఫలితం రావడం కొసమెరుపు. ఓవర్‌నైట్‌ స్కోరు 529/1తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌.. 615/4 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ 256 పరుగులకు ఆలౌటైంది. దివ్యాన్ష్‌ (91) టాప్‌ స్కోరర్‌ కాగా.. తనయ్‌, సాయిరామ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తాజా సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ బోనస్‌ పాయింట్‌ విజయాలు సాధించింది.



Source link

Related posts

Australian Cricketer: తలకు బంతి తగిలి కుప్పకూలిన క్రికెటర్‌, వణికిపోయిన ఆస్ట్రేలియా

Oknews

Sarfaraz Khan: జాతీయ జట్టుకు ఎంపికవడంపై సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ సంతోషం

Oknews

South Africa Reaches Top Spot In World Cup 2023 Points Table Check Details | World Cup Points Table: పాయింట్ల పట్టికలో తిరిగి టాప్‌ ప్లేస్‌కు సౌతాఫ్రికా

Oknews

Leave a Comment