Latest NewsTelangana

Medaram Sammakka Saralamma maha Jatara 2024 special story


Medaram Sammakka Saralamma maha Jatara 2024:  సమ్మక్క, సారలమ్మలకు రూపం లేదు. సమ్మక్క గద్దెను ఆనుకునే భారీ నెమలి నార చెట్టు ఉండేది.  గతంలో ఈ  నారెపుచెట్టుకే పసుపు కుంకుమ పెట్టి సమ్మక్కగా భావించే వారు. వడ్డెలు (పూజారులు) చిలకల గట్టు నుంచి కుంకుమ భరిణె తీసుకొచ్చి నార చెట్టు వద్దే ఉంచి పూజలు చేసేవారు. చెట్టు, పుట్టలే గిరిజనులకు సమ్మక్క సారక్కలు. ఇప్పటికీ ఆదివాసీ గూడేంలో మేడారం గద్దెలను పొలిన ఇంటి అరుగులు ఉంటాయి. కాల క్రమేణా గద్దెల మీద సమ్మక్క సారక్కలు సింహం, పులి మీద ఉన్నట్లుగా ఫోటోలు ముద్రించి జాతరలో అమ్మకాలు చేశారు. ఆ ఫోటోలే భక్తుల మదిలో నిలిచిపోయాయి..

Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం – భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!

సంతృప్తిగా అమ్మను తాకి మొక్కులు చెల్లించేవారు

భక్తుల సంఖ్య పెరగడంతో గద్దెల ప్రాంగణంలో బండలు వేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పై భాగంలోనూ పాలిష్ బండలు అమర్చారు. 1990 కన్నా ముందు జాతర కొచ్చే గిరిజనులు, గ్రామీణులు  నేరుగా గద్దెలపైకి వెళ్లి తాము తెచ్చిన బంగారం, వడిబియ్యం, ఇతరకానుకలు సమర్పించుకునే వారు. భక్తులు అమ్మవార్ల గద్దెలను స్వయంగా తాకి సంతృప్తిగా మొక్కులు తీర్చుకునేవారు. 

గద్దెల చుట్టూ బారికేడ్లు వచ్చి చేరాయ్

రాను రాను భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో జాతర సమయంలో గద్దెల చుట్టూ  కట్టెలతో బారికేడ్లు కట్టారు. బారికేడ్ల బయట నుంచి అమ్మవార్లను దర్శించుకుని తాము తెచ్చిన బెల్లం, కుడకలు,వడిబియ్యం దూరంనుంచే గద్దెలపైకి వేసేవారు. ఆ సమయంలో కట్టెల బారికేడ్ల వద్ద బందోబస్తులో ఉండే పోలీసులు,  స్వచ్ఛంద సంస్థలు, ఆదివాసీ గిరిజన సంఘం కార్యకర్తలకు కొబ్బరికాయలు, బెల్లం తగిలి గాయాలయ్యేవి. ఈ ప్రమాదాలను నివారించేందుకు  2002 లో అప్పటి జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల చుట్టూ ఎత్తైన గ్రిల్స్ లను నిర్మించాలని నిర్ణయించింది.  ప్రస్తుతం గద్దెల చుట్టూ ఉన్న ఎత్తైన గ్రిల్స్ అప్పుడు ఏర్పాటు చేసినవే. 

Also Read: ఈ ఏకాదశి నుంచి ఈ 5 రాశులవారికి అదృష్టం మొదలవుతుంది

ఈ చెట్టు బెరడు చాలా ప్రత్యేకం

90వ దశకం ముందు కేవలం మూడు అడుగుల ఎత్తులో ఉన్న గద్దెలపై తొమ్మిది అడుగుల ఎత్తులో సమ్మక్క ప్రతిరూపం ఉండేది. జాతర రెండో  రోజు నెమలి నార చెట్టు పై నాగు పాము వస్తుందని ఆదివాసులు చెబుతారు. ఈ చెట్టు బెరడు తీసుకుని వాటి  పొడి పిల్లలకు పాలలో వేసి తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో భక్తులంతా ఆ చెట్టు బెరడు తీసుకెళ్లేవారు. ఆ భారీ వృక్షం క్రమంగా ఎండిపోవడంతో ప్రస్తుతం తిరిగి మరో చెట్టుని ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతున్నారు. అమ్మవార్ల బొమ్మలు జాతర్లలో అమ్ముతున్నప్పటికీ చాలా మంది నెమలినార చెట్టు ను సమ్మక్క దేవతగా భావిస్తారు

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
   
నిరాడంబరంగా ఉన్న అమ్మవారు అలంకారాలతో మెరిసింది

సారలమ్మ ప్రతిరూపమైన  గద్దె దాదాపు పదిహేను అడుగుల ఎత్తులో ఉండేది. ఈ గద్దెల చుట్టూ ఏవిధమైన అలంకారాలుండేవి కావు. క్రమక్రమంగా గద్దెలకు తాము తెచ్చిన చీరలతో అలంకరించడం ప్రారంభించారు. ఇలా తొలినాళ్లలో చాలా నిరాడంబరంగా ఉండే సమ్మక్క సారలమ్మ ల గద్దెలు, క్రమక్రమంగా  ఎత్తైన అరుగుల నిర్మాణం, అనంతర కాలంలో వీటి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు వరకు మార్పు చెందాయి.

ఈ మార్పులు ఆహ్వానించదగినవే అయినప్పటికీ…బాహ్యప్రపంచంలో భక్తులకు దగ్గరగా ఉన్న అమ్మవార్లను ఇప్పుడు ఇనుప గ్రిల్స్ మధ్య దర్శించుకోవాల్సి వస్తోందంటున్నారు కొందరు భక్తులు.

మరిన్ని చూడండి



Source link

Related posts

PM Narendra Modi Telangana tour for two days confirmed in Adilabad and sangareddy districts

Oknews

Nampally ACB Court Dismisses Shiva Balakrishna Bail Petition

Oknews

Free WiFi in Medaram: మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు.. 16చోట్ల హాట్ స్పాట్లు

Oknews

Leave a Comment