హైదరాబాద్: పుట్టుకతో వచ్చిన వైకల్యంతో (శరీరం వెలుపల గుండెతో మరియు ఉదరభాగంతో) జన్మించిన 16 నెలల శిశువుకి విజయవంతంగా సర్జరీ చేసి పాప ప్రాణాలను కాపాడారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ వైద్య విభాగం వైద్యులు ఈ అరుదైన సర్జరీ చేశారు. టాంజానియాకు చెందిన 16 నెలల చిన్నారికి అరుదైన పుట్టుకతోవచ్చిన వైకల్యంతో జన్మించిన చిన్నారికు పీడియాట్రిక్ కార్డియాక్ సైన్సెస్ టీమ్ మరియు పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ టీమ్ విజయవంతంగా సర్జరీ చేసి పాప ప్రాణాలను కాపాడారు.
గుండె, ఛాతీ ఉదర భాగాలను ప్రభావితం చేసే సంక్లిష్ట లోపాలతో పాప జన్మించింది. ఆ పాపకు గుండె ఛాతీ కుహరం వెలుపల కొట్టుకోవడం, చర్మంతో మాత్రమే కప్పి ఉండటం, పేగులు, ఇతర ఉదర అవయవాలు బయటకు పొడుచుకు వచ్చాయి. పెంటలజీ ఆఫ్ కాంట్రెల్ (POC) అని పిలువబడే ఈ పరిస్థితి డాక్టర్స్ కు సవాలుతో కూడుకున్నది. కాంట్రెల్ యొక్క పెంటాలజీ అనేది చాలా అరుదైన పుట్టుకతో వచ్చే రుగ్మత. ఇది దిగువ స్టెర్నమ్, డయాఫ్రాగమ్, పొత్తికడుపు గోడ, పెరికార్డియం మరియు గుండెకు సంబంధించిన మధ్యరేఖ లోపాల కలయికతో ఉంటుంది. దీనిని సరిచేయడానికి మల్టీడిసిప్లినరీ విధానం, ప్రత్యేక శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. సర్జరీ సక్సెస్ చేయడం సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా SPO2 95% ఉండాలి కానీ ఈ చిన్నారికి 63 శాతం ఉండటం పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా ఆక్సిజనేటెడ్ రక్తం ఎర్రగా కనిపించే ధమనులు గుండె నుండి రక్తాన్ని సరఫరా చేస్తాయి. డీఆక్సిజనేటెడ్ రక్తం నీలం రంగులో కనిపించే సిరలు గుండెకు రక్తాన్ని తిరిగి పంపుతాయి. అది పూర్తి పరిణామం చెందలేదు. ఈ చిన్నారికు జఠరిక ఒక్కటే ఉండటం వల్ల రక్తాన్ని ఇతర భాగాలకు పంపించడం మాత్రమే జరుగుతుంది. నీలం రంగులో ఉండే రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపటానికి ప్రత్యేక సిరల ద్వారా లంగ్స్ కి అమర్చారు.
పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరీలలో ప్రత్యేకత కలిగిన అత్యంత శిక్షణ పొందిన సర్జన్ల రెండు బృందాలు 14 గంటల పాటు సర్జరీ చేశాయి. TIBA హాస్పిటల్ సహకారంతో టాంజానియాలోని దార్ ఎస్ సలామ్‌లోని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ఔట్‌రీచ్ OPDలో రోగి నిర్ధారణ అయింది. శస్త్రచికిత్స కోసం చిన్నారిని భారత్‌కు తీసుకువచ్చారు. చికిత్సకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు, CVT సర్జన్‌లు, పీడియాట్రిక్ సర్జన్‌లు, ప్లాస్టిక్ సర్జన్‌లు, పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థటిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లు మరియు నర్సింగ్ సిబ్బందితో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం నైపుణ్యం అవసరం. అంతా కలిసి పాపకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు.
డాక్టర్ ఆశిష్ సప్రే, డాక్టర్ శ్రీనివాస్ కిని, డాక్టర్ మధు మోహన్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే, డాక్టర్ పవన్ ప్రసాద్, డాక్టర్ మధు వినయ్, డాక్టర్ సంధ్య (పీడియాట్రిక్ అనస్థీసిస్ట్ ), డాక్టర్ నిర్మల్ రెడ్డి (పీడియాట్రిక్ అనస్థీసిస్ట్), మెడికవర్ ప్రత్యేక నర్సింగ్ బృందం ఫిబ్రవరి 22న చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు 10 రోజులలోపు డిశ్చార్జికి చిన్నారి సిద్ధంగా ఉంది.
పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ సప్రే మాట్లాడుతూ.. ఇంత చిన్న పేషెంట్‌లో అత్యంత క్లిష్టతరమైన అరుదైన పుట్టుకతో వచ్చే లోపానికి సర్జరీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ మల్టీడిసిప్లినరీ స్పెషలిస్ట్ టీమ్ మధ్య సహకారం, మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ మరియు యాజమాన్యం సహకారంతో సర్జరీ విజయవంతం చేశామన్నారు. 55 లక్షల మందిలో ఒక్కరే ఇలా పుడతారని, ఇప్పటివరకూ ప్రపంచంలో 90 మందికి ఇలా జరిగిందని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్ లో పీడియాట్రిక్ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ మధు మోహన్ రెడ్డి.బి తెలిపారు. భారతదేశంలో ఈ చిన్నారికి జరిగిన సర్జరీ మొట్టమొదటిది. ఈ సర్జరీతో మరెన్నో క్లిష్టతరమైన కేసులకు పరిష్కారం చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లతో కూడిన కేసును విజయవంతంగా పరిష్కరించామని CVT సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ కిని అన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పీడియాట్రిక్ రోగులకు మల్టీస్పెషాలిటీ సంరక్షణను అందించడంలో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తన ప్రతేకతను చాటుకున్నది.
మరిన్ని చూడండి