Mumbai Indian target 207: ముంబై(MI)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్(CSK) భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్.,.. శివమ్ దూబే మెరుపు బ్యాటింగ్‌తో చెన్నై భారీ స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 69, శివమ్ దూబే 66 పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లు వికెట్లు తీయకపోయినా భారీగా పరుగులు మాత్రం సమర్పించుకోలేదు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సులు, రెండు పరుగులతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాంఖడే మార్మోగిపోయింది.
దూబే, గైక్వాడ్ జోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అజింక్యా రహానే రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఎనిమిది బంతుల్లో ఒక ఫోర్‌తో అయిదు పరుగులు చేసిన రహానేను… కోయిట్జే అవుట్ చేశాడు. పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్ చేరాడు. అనంతరం రచిన్ రవీంద్ర-రుతురాజ్ గైక్వాడ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 52 పరుగులు జోడించారు. బలపడుతున్న ఈ జోడీని శ్రేయస్స్ గోపాల్ విడదీశాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 21 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర…. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో ఇషాన్‌కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్- శివమ్ దూబే ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో కాస్త తడబడ్డ ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో అలరించారు. ఈ క్రమంలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 33 బంతుల్లో ఆర్థ శతకం అందుకున్నాడు. కొయిట్జే వేసిన ఓవర్‌లో నాలుగో బంతిని సిక్స్ బాది రుతురాజ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శివమ్ దూబే కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. రొమారియో షెపర్డ్ వేసిన 14వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఈ క్రమంలో శివమ్ దూబే కేవలం 28 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దూబే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే రుతురాజ్ అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రుతురాజ్ అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. చివరి వరకూ క్రీజులో నిలిచిన శివమ్ దూబే 38 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డేరిల్ మిచెల్ 14 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ధోనీ చివర్లో మెరుపులు మెరిపించాడు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సులు, రెండు పరుగులతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాంఖడే మార్మోగిపోయింది. రుతురాజ్ గైక్వాడ్, దూబే, ధోనీ చెలరేగడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
ఆత్మ విశ్వాసంతో ముంబై
ఈ ఐపీఎల్‌ను పరాజయాలతో ప్రారంభించిన ముంబై వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి గాడినపడింది. సూర్యకుమార్ యాదవ్ వచ్చిన తర్వాత ముంబై బ్యాటింగ్ చాలా బలంగా మారింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసమే సృష్టించాడు.
కేవలం 17 బంతుల్లో అర్ధశతకం చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఇప్పుడు చెన్నైపై సూర్య ఎలా ఆడతాడో వేచి చూడాలి. వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో నాలుగు ఓవర్లు ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్లను చెన్నై బౌలర్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. ఇషాన్ కిషన్ 161 పరుగులు, రోహిత్ విధ్వంసం, పాండ్యా లతో ముంబై బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది.
మరిన్ని చూడండి