Sports

MI vs RR IPL 2024 Rajasthan Royals won by 6 wkts


MI vs RR Rajasthan Royals won by 6 wkts:  ముంబయి(MI)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్(RR) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ముంబయి టీం కి ఓటమి పరంపర కొనసాగినట్టైంది. 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో రియాన్‌ పరాగ్ మెరుపులు కురిపించాడు. రాజస్థాన్‌కిది మూడవ  విజయం కాగా.. ముంబయికి వరుసగా ఇది మూడో ఓటమి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  అంతకుముందు ట్రెంట్ బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లతో చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

 

రాజస్థాన్‌(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడమే గగనమైంది. తొలి ఓవర్‌లో మొదలైన ముంబై కష్టాలు చివరి ఓవర్‌ వరకూ కొనసాగాయి.

 

 కొనసాగిన ముంబై కష్టాలు 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది. రోహిత్‌ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో సంజు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి హిట్‌ మ్యాన్‌ వెనుదిరిగాడు. దీంతో ఒక్క పరుగుకే ముంబై ఒక వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కూడా ముంబై కష్టాలు కొనసాగాయి. ఆ తర్వాత వెంటనే మరో వికెట్‌ పడిపోయింది. రోహిత్‌ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సమన్‌ థిర్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది. అనంతరం ట్రెంట్‌ బౌల్ట్ మరో వికెట్‌ తీసి ముంబై వెన్ను విరిచాడు. తొలి ఓవర్లో రోహిత్‌ శర్మ, సమన్‌ థీర్‌ను అవుట్‌ చేసిన బౌల్ట్‌… ఇంపాక్ట్‌ ప్లేయర్‌  బ్రెవిస్‌ను అవుట్ చేశాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయిన ముగ్గురు డకౌట్‌ కావడం విశేషం. దీంతో మూడు ఓవర్లకు 16 పరుగులకు  మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఇషాన్‌ కిషన్‌ కూడా అవుటయ్యాడు. 16 పరుగులు చేసిన ఇషాన్‌ను నంద్రి బర్గర్‌ అవుట్‌ చేశాడు. దీంతో 20 పరుగుల వద్ద ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి… పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం తిలక్‌ వర్మ, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. కానీ ఈ దూకుడు ఎంతో సేపు సాగలేదు. 21 బంతుల్లో 34 పరుగులు చేసిన పాండ్యాను చాహల్‌ అవుట్‌ చేశాడు. దీంతో 10 ఓవర్లకు 75 పరుగులకు ముంబై అయిదో వికెట్ కోల్పోయింది. కాసేపటికే మూడు పరుగులు చేసిన పీయూష్‌ చావ్లా అవుటయ్యాడు. ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో పీయూష్‌ చావ్లా అవుటయ్యాడు. తర్వాత 32 పరుగులు చేసిన తిలక్‌ వర్మ కూడా అవుట్‌ కావడంతో ముంబై పనైపోయింది. టిమ్ డేవిడ్‌ 17 పరుగులు… గెరాల్డ్‌ కొయిట్జీ నాలుగు పరుగులు…. చేసి అవుటైపోయారు. దీంతో ముంబై ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Our Mom Is Fit And Fine Virat Kohli S Brother Clears Rumours About His Mother S Health

Oknews

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ – టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

Oknews

MS Dhoni Seeks Blessings At Dewri Temple In Tamar Ahead Of IPL 2024

Oknews

Leave a Comment