Latest NewsTelangana

Minister Ponnam Prabhakar phone call with an MRO has gone viral | Minister Ponnam Prabhakar : మంత్రి ఫోన్ రికార్డ్ చేసి వైరల్ చేసిన ఎమ్మార్వో


Minister Ponnam Prabhakar  phone call with an RDO has gone viral :  పొన్నం ప్రభాకర్ కాల్ రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  ఆ ఫోన్ కాల్‌లో మాట్లాడిన హనుమకొండ ఎమ్మార్వో కాల్ రికార్డ్ చేసి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పంపించారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. ఎమ్మార్వో పై తెలంగాణ సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫోన్ కాల్ రికార్డింగ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డికి పంపించారని, వెంటనే ఆ అధికారిపై  శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

అసలేం జరిగిదంంటే ?                    

కల్యాణలక్ష్మి చెక్కులను హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డితో పంపిణీ చేయించొద్దని ఆదేశాలు జారీ చేశారు పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి చేతుల మీదుగా ఒక్క లబ్ధిదారునికి కూడా కల్యాణలక్ష్మి చెక్కు అందిచొద్దన్నారు. గతంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉంటే.. ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారని అధికారితో చెప్పారు పొన్నం. అయితే తమకు ప్రస్తుతం ఎమ్మెల్సీ లేడని.. పోటీ చేసి ఓడిన వ్యక్తి   ఉన్నాడని చెప్పారు. అధికారులే కల్యాణలక్ష్మి చెక్కులు పంచాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే స్థానిక సర్పంచ్‌ లేదా ఇతర ప్రతినిధులతో పంపిణీ చేయించాలన్నారు.కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్యే కాదని, అధికార పార్టీకి చెందిన వ్యక్తి అంతకంటే కాదని అధికారితో చెప్పారు పొన్నం. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారులకే పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ ఫోన్‌కాల్‌లో చెప్పారు. 

ఆర్డీవోతో మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం             

పొన్నం ప్రభాకర్ ఇలా మాట్లడిన తర్వాత ఆ చెక్కులు ఎమ్మెల్యేల చేతుల మీదుగానే పంపిణీ చేశారు. కానీ ఆడియో మాత్రం లీక్ అయింది. తన ఆడియోను రికార్డు చేసి.. బీఆర్ఎస్ నేతలకు ఇచ్చారని పొన్నం ప్రభాకర్ కు తెలిసింది. దీంతో ఆయన ఫైర్ అవుతున్నారు. తమ ప్రభుత్వంలో మంత్రి అనే భావన లేకుండా.. రికార్డు చేసి.. విపక్ష నేతలకు ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో విపక్ష నేతలకు అవకాశం ఇవ్వరు. ముఖ్యంగా  పథకాలన్నీ తమ పార్టీ వారి  చేతుల మీదుగానే జరగాలని అనుకుంటారు. గతంలో అదే జరిగింది. అయితే ఆ ఆర్డీవో ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడంతో వివాదాస్పదమవుతోంది. 

పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్ ఉంటే దీపాదాస్ చూసుకుంటారు !              

పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ గురించి పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ చూసుకుంటారని పొన్నం ప్రభాకర్ అన్నారు.  నా వాయిస్ రికార్డ్ చేసిన mro మీద చీఫ్ సెక్రెటరికి ఫిర్యాదు చేశానని..  చీఫ్ సెక్రటరీ చర్యలు తీసుకుంటారన్నారు.  ఆస్కార్ అవార్డు పొందాలంటే ఎంత  తాపత్రయం పడుతారో నటనలో బండి సంజయ్ అంత తాపత్రయం పడుతున్నారన్నారు.  కారణం లేకుండా నా మీద ఆభాండం వేసాడు ..అందుకే నేను సజీవ దహనం కి సిద్ధం అన్నానన్నారు.  నిరూపించలేక పోయారు కాబట్టే సైలెంట్ గా ఉన్నారన్నారు.   బండి సంజయ్ అవినీతి పరుడు కాదని కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్ చేశారు.  

 

మరిన్ని చూడండి



Source link

Related posts

BJP First hundred parliament candidates List Released Today for Elections 2024 | BJP Parliament Candidate List : నేడే వంద మంది బీజేపీ పార్లమెంట్ సభ్యుల తొలి జాబితా

Oknews

శ్రీరామ్‌ హీరోగా సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కోడి బుర్ర’

Oknews

రేవంత్‌ను ఫాలో అవుతున్న బాబు.. గెలుపేనా!

Oknews

Leave a Comment