15వ తేదీన కవిత అరెస్ట్…దిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case)రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు(ED Raids) సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసుపై ఈడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితదే (Mlc Kavitha)కీలక పాత్ర అని తెలిపింది. కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.
Source link
previous post