ఈ సంక్రాతికి బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి మూడు అతి పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మాహాజార్ మరియు విక్టరీ వెంకటేష్ సంక్రాతికి వస్తున్నాం సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఏపీలో అన్ని సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనే అంశం పెద్ద సవాలుగా మారింది.
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఇటు చిత్ర సీమలో అటు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఇక మీదట తెలంగాణలో ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపులు ఉండవని స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
మరి ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య విడుదలకు సిద్దమైన మూడు సినిమాలకు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉంటుందా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత మరియు TFDC ఛైర్మెన్ దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపు కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతాను. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారమే చూడాలి. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ముందు చూపుతో ఉన్నారని.. దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇటు ఏపీలో సినిమా రేట్ల పెంపుకు అంగీకరించిన ప్రభుత్వానికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
50 ఏళ్ల వయసులో రేణు ఆంటీ అందాల ఆరబోత
See Full Gallery Here…
Topics: