Telangana

MRPS Founder Manda Krishna Madiga slams Revanth Reddy for his remarks



హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాలలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గుణపాఠం తప్పదని అన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.మరోసారి మాదిగలకు తీరని అన్యాయం‘కడియం శ్రీహరి కూతురు కావ్యకి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ కేటాయించింది. మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాలు ఉంటే.. మూడు స్ధానాలను మాదిగలకు కేటాయించ లేదు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయమే చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాదిగలను జనాభా లెక్కల నుంచి తీసేసింది. కాంగ్రెస్ పార్టీలో మాలలకు తప్ప మాదిగలకు సముచిత స్థానం లేదు. స్థానికుడు కాకపోయినా నాగర్ కర్నూల్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించింది. వరంగల్ ఎస్సీ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు. సొంత పార్టీ నాయకులు వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించి భంగం పడ్డారు. ఊరికి ఒక్కరు లేని బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించారు. తెలంగాణలో నూటికి 70 శాతం ఉన్న మాదిగలకు గుర్తించడం లేదు’ – మందకృష్ణ మాదిగ
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతాం అన్నారు. మేము ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తాం. మాదిగలే తన గెలుపునకు దోహద పడ్డారన్న రేవంత్ రెడ్డి ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వ లేదు? అని ప్రశ్నించారు. రెడ్డి సామాజికవర్గానికి తప్ప.. ఎవరికీ న్యాయం చేయలేదని విమర్శించారు. చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మెజార్టీ అభ్యర్థులు రెడ్డిలకే కేటాయించారు.12 స్థానాల్లో మెజార్టీ స్థానాలు రెడ్డిలే ఉన్నారు. మాదిగలతో పాటు బీసీలకి కూడా రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని మందకృష్ణ మాదిగ విమర్శించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

TS తీసేసి TG పెడితే మార్పు వచ్చేసినట్లేనా.?

Oknews

petrol diesel price today 15 March 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 15 Mar: రూ.2 తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ, యువకుడి హత్య- నిందితులను పట్టించిన సెల్ ఫోన్-siddipet crime news in telugu quarrel between drunk persons youth murdered ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment