Sports

MS Dhonis Cryptic New Seasonnew Role IPL Post Adds Suspense To CSK Future


MS Dhoni’s latest Facebook post before IPL 2024 leaves fans guessing: మహేంద్రసింగ్‌ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ధోనీ తాజాగా చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

ధోనీ పోస్ట్‌లో ఏముందంటే? 
ఇండియన్స్‌  ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న వేళ చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో ధోనీ రిటైర్‌మెంట్ అంశం మ‌రోసారి చ‌ర్చకు వ‌చ్చింది. కొత్త సీజన్-కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండని ధోని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌తో ధోనీ మరోసారి ఆటకు వీడ్కోలు పలకునున్నాడన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. ధోని కోచ్‌గా ఉంటాడ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ధోనీ కోచింగ్ చేస్తార‌ని ఒకరు… కొత్త పాత్ర అంటే ఏమిటి అని మరికొందరు  కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇంకో రెండేళ్లు!
ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాల వేళ మహీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్‌ సింగ్‌ కీలక విషయాన్ని వెల్లడించాడు. ధోనీ ఫిట్‌నెస్‌ చూస్తే ఇదే చివరి సీజన్‌ అని అనుకోలేమని… ప్రస్తుత సీజన్‌తోపాటు కనీసం మరో రెండేళ్లు ఆడతాడని అనుకుంటున్నానని… దానికి కారణం అతడి ఫిట్‌నెస్‌ స్థాయే కారణమని అన్నాడు.

స్నేహమేరా జీవితం అన్న ధోనీ
ఈ మధ్య ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. అది ఏ పెద్ద కంపెనీ లోగోనో కాదు. ఆ బ్యాటుపై ఉన్న స్టిక్కర్ ఏ కంపెనీది కాదు. ఆ స్టిక్కర్ మీద అత‌డి స్నేహితుడి షాపు పేరు రాసి ఉంది. బాల్యమిత్రుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో ధోనీ తన ఫ్రెండ్‌ షాప్ పేరుతో ఉన్న స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మ‌హీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్’ అనే క్రీడా పరికరాల దుకాణం ఉంది. ఇందులో క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇత‌ర ఆట సామ‌గ్రి ల‌భిస్తాయి. దాంతో, త‌న మిత్రుడి దుకాణానికి మ‌రింత పాపులారిటీ తేవ‌డం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారాయి. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. త‌న కెరీర్‌లో చాలా కంపెనీల లోగో ఉన్న బ్యాట్‌లు ఉప‌యోగించాడు. అత‌డు స్నేహితుల దుకాణం పేరున్న బ్యాటుతో క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి.



Source link

Related posts

Team India Arrival T20 World Cup winners Rohit Sharma Virat Kohli touch down in Delhi

Oknews

MI vs CSK IPL 2024 Mumbai Indian target 207

Oknews

USA vs SA T20 World Cup 2024 Super 8 Highlights SA win by 18 runs

Oknews

Leave a Comment